టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండియాలో ఒకప్పుడు కుర్రకారు కలల రాణిగా వెలిగిపోయిన ఖుష్బూ సుందర్.. ఇప్పుడు తన లేటెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 50 ఏళ్లు దాటినా కూడా పాతిక ఏళ్ల చిన్నదానిలా ఎలా మారిపోయింది అని అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వెయిట్ లాస్ ప్రయాణం గురించి ఆమె చెప్పిన మాటలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

98 కిలోల బరువు.. అద్దం చూసుకోవాలంటేనే భయం!
రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ సమయంలో తాను ఏకంగా 98 కిలోల బరువు ఉండేదాన్నని ఖుష్బూ బయటపెట్టింది. ఆ సమయంలో అద్దంలో తన ముఖం చూసుకుంటే ఏనుగులా గుండ్రంగా కనిపించేదని, తన ముఖం చూసి తనకే భయమేసేదని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. భారీ బరువు వల్ల మోకాళ్ల నొప్పులు, మెట్లు ఎక్కాలంటే విపరీతమైన ఆయాసం వచ్చేదని, ఆ బాధలు భరించలేకే బరువు తగ్గాలని ఫిక్స్ అయినట్లు తెలిపింది.

55 ఏళ్ళలోనూ బీపీ, షుగర్ లేవు.. ఇది కదా అసలైన ఫిట్‌నెస్!
సాధారణంగా ఈ వయసులో చాలా మందికి లైఫ్ స్టైల్ వ్యాధులు చుట్టుముడతాయి. కానీ ఖుష్బూ మాత్రం తనకు బీపీ, షుగర్ వంటి సమస్యలు ఏమీ లేవని గర్వంగా చెబుతోంది. “మా అమ్మకు హై బీపీ ఉండేది, కానీ నాకు మాత్రం ఆ జబ్బు రాలేదు.. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను” అని ఆమె పేర్కొంది. ఈ బరువు తగ్గడానికి ఆమెకు దాదాపు నాలుగేళ్ల సమయం పట్టిందని, లాక్ డౌన్ సమయంలో తన జర్నీ మొదలుపెట్టినట్లు వివరించింది.

ఖుష్బూ చెప్పిన ఆ ఒక్క పని చేస్తే చాలు!
బరువు తగ్గడానికి ఖుష్బూ చేసిన అతి ముఖ్యమైన పని ‘డైట్ కంట్రోల్’. ముఖ్యంగా మైదా, చపాతీ వంటి పదార్థాలను తన ఆహారం నుండి పూర్తిగా తొలగించేశానని ఆమె చెప్పింది. సరైన ఆహార నియమాలు పాటిస్తూ, పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి బరువునైనా తగ్గించవచ్చని ఆమె నిరూపించింది. తాను లావుగా ఉన్నప్పుడు ఆదరించిన ప్రేక్షకులు, ఇప్పుడు స్లిమ్ గా మారిన తర్వాత కూడా అదే ప్రేమని చూపిస్తున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.
సినిమాల్లో మళ్ళీ వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఖుష్బూ, తన హెల్త్ టిప్స్ తో ఫిట్‌నెస్ ప్రేమికులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఖుష్బూ చెప్పినట్లుగా జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంటే మీరు కూడా స్లిమ్ గా మారడం గ్యారెంటీ!

