శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్, నాగార్జున కాంబినేషన్‌తో తెరకెక్కిన “కుబేర” ఓ భారీ హిట్‌గా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ఈ సినిమా ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాప్ట్‌గా మొదలైన ప్రమోషన్స్‌కే ఈ స్థాయి హైప్ వస్తే… సినిమా రిలీజైన తర్వాత అంచనాలకు మించి రెస్పాన్స్ వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు – ఇది కమ్ముల కెరీర్‌లోనే కాదు, తెలుగు సినిమా క్రాస్‌ఓవర్ హిస్టరీలోనూ ఓ ప్రాముఖ్యమైన విషయంగా మారింది.

ప్రస్తుతం ట్రెండ్ చూస్తే, ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ మార్క్‌ను త్వరలోనే దాటి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కుబేర 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ – ఏరియా వారీగా:

తెలంగాణ: ₹17 కోట్లు

ఆంధ్రప్రదేశ్: ₹22 కోట్లు

తమిళనాడు: ₹15 కోట్లు

కర్ణాటక: ₹6.25 కోట్లు

కేరళ: ₹0.95 కోట్లు

రెస్టాఫ్ ఇండియా (ROI): ₹2 కోట్లు

ఓవర్సీస్: ₹23.25 కోట్లు

👉 వరల్డ్‌వైడ్ గ్రాస్: ₹86.45 కోట్లు

తెలుగులో హిట్ – తమిళంలో డిప్

తెలుగు ఆడియెన్స్ సినిమా థీమ్‌, కథలోని సాంఘిక వాస్తవతను, ధనుష్-నాగార్జున నటనను మెచ్చుకున్నారు. ముఖ్యంగా ధనుష్ పాత్రకు వస్తున్న స్పందన చాలా భారీ స్థాయిలో ఉంది. కానీ తమిళనాట మాత్రం సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో మండే రోజు పెద్దగా కలెక్షన్స్ లేకుండా పోయాయి.

, , , ,
You may also like
Latest Posts from