ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య ఈ వారంలో రిలీజ్ కానున్న ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే నాగ చైతన్య నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందబోతున్న నాగచైతన్య నెక్స్ట్ మూవీకి మేకర్స్ ఓ క్రేజీ విలన్ ని సెట్ చేసారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో స్వర్శ్ శ్రీవాస్తవ్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. అన్ని సెట్ అయితే త్వరలోనే ప్రకటన వచ్చే అవకాసం ఉంది.
నాగ చైతన్య, ‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు సినిమా ఇప్పటికే షూటింగ్ లాంచనాలతో మూవీ స్టార్ట్ అయ్యింది కూడా.
ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. 2025 చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇంకా ఈ మూవీకి మేకర్స్ టైటిల్ ని ఖరారు చేయలేదు. అయితే ఈ సినిమాకు ‘వృషకర్మ’ అనే టైటిల్ ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.