టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అపజయమే ఎరుగని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘వారణాసి’ గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ఎలాంటి హడావిడి లేకుండా, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకుండానే ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైపోయింది. అది కూడా ఎక్కడో తెలుసా? సాక్షాత్తూ వారణాసి పుణ్యక్షేత్రం వీధుల్లో ఈ సినిమా హోర్డింగ్స్ ప్రత్యక్షమవడంతో అభిమానులు షాక్‌లో ఉన్నారు.
సమ్మర్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ!
రాజమౌళి పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమా కోసం అత్యంత లాభదాయకమైన డేట్‌ను లాక్ చేశారు. 2027, ఏప్రిల్ 7వ తేదీన ‘వారణాసి’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సరిగ్గా ఉగాది పర్వదినం రోజున థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సెలవుల పండగ తోడవ్వనుంది.
ఎందుకీ డేట్ స్పెషల్?
ఏప్రిల్ 7: ఉగాది పండుగ రోజున గ్రాండ్ రిలీజ్.
ఏప్రిల్ 10, 11: మొదటి వీకెండ్ కావడంతో వసూళ్ల వర్షం గ్యారెంటీ.
ఏప్రిల్ 14: అంబేడ్కర్ జయంతి సెలవు.
ఏప్రిల్ 15: శ్రీరామ నవమి సెలవు.
ఏప్రిల్ 17, 18: రెండో వీకెండ్ అడ్వాంటేజ్.
వరుస సెలవులు, పైగా సమ్మర్ సీజన్ కావడంతో బాక్సాఫీస్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ.. మ్యూజిక్ మాంత్రికుడి మ్యాజిక్!
ఈ సినిమా ఒక మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కె.ఎల్. నారాయణ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన బాణీలు అందిస్తున్నారు.
రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి, భారతీయ సినిమా చరిత్రలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. రాజమౌళి – మహేష్ కాంబోలో రాబోతున్న ఈ వండర్ కోసం మీరెంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి!

