కోలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్ గా చేస్తే ఆ క్రేజే వేరు అని నమ్ముతూంటారు ఇక్కడ సక్సెస్ అయన వాళ్లు. అలాగే శ్రీలీల కూడా అక్కడకి ప్రయాణం పెట్టుకుంది. సెన్సేషన్ ఆఫ్ టాలీవుడ్ గా వెలిగిన శ్రీలీల ఈ మధ్యే తమిళంలో కూడా అడుగు పెట్టింది. అక్కడ శివకార్తికేయన్‌తో పరాశక్తి సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది ఈ భామ.

మర్డర్ ఫేమ్ అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు శ్రీలీల. టీజర్ చూస్తుంటే ఆషికి 3 అని అర్థమవుతుంది. ఈ పరిణామం ఉత్సాహం పెంచుతున్నప్పటికీ, ఆమె పారితోషికం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

తెలుగులో శ్రీలీల ఒక సినిమాకు కనీసం రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తోంది. పుష్ప 2 లో (Pushpa 2: The Rule) కేవలం స్పెషల్ సాంగ్ కోసం ఆమె రూ. 2 కోట్లు అందుకుంది. కానీ, బాలీవుడ్ ఎంట్రీలో మాత్రం కేవలం రూ. 1.75 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు టాక్.

హిందీ మార్కెట్ లో మొదటి సినిమా కాబట్టి తక్కువ రెమ్యునరేషన్ కు ఓకే చెప్పిందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా గ్లామర గా సాగుతుందిట. హాట్ హాట్ అందాలు చూపడంలో దర్శకుడు అనురగ బసుకు మర్డర్ నాటి నుంచి అనుభవం ఉంది . కాబట్టి మామూలుగా ఉండదంటున్నారు.

మొదట ఆషికి 3 సినిమాలో త్రిప్తి డిమ్రీని (Tripti Dimri) తీసుకోవాలని అనుకున్నప్పటికీ, చివరకు శ్రీలీలని ఫైనల్ చేశారు. పుష్ప 2 తో ఆమెకు అక్కడ క్రేజ్ రావటం ఓ కారణం. అలాగే తెలుగు లో ఆమెకు ఉన్న పాపులారిటీ, డాన్స్ స్కిల్స్, గ్లామర్ అన్ని కలిపి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

కానీ సినీ వర్గాల మాట ప్రకారం, మొదటి సినిమాతో సక్సెస్ సాధిస్తే వెంటనే ఆమె పారితోషికం రెట్టింపు అవుతుందని, ఆ ఉద్దేశంతోనే శ్రీలీల ఈ ఆఫర్ ను అంగీకరించిందని చెప్తున్నారు.

ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తమిళంలో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. మరి బాలీవుడ్ డెబ్యూ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.