సినిమా వార్తలు

మళ్లీ ప్రేమకథల బాటలో మణిరత్నం – ఈసారి మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా?

మణిరత్నం… పేరు వింటేనే ప్రేమకథలు పూలవర్షంలా కురుస్తాయి. “థగ్ లైఫ్” ఆశించిన స్థాయిలో అలరించకపోయినా, ఈ దిగ్గజ దర్శకుడి శైలి, విశ్వాసం మాత్రం క్షణం కూడా మసకబడలేదు. ఎందుకంటే మణిరత్నం knows how to bounce back — and history proves it.

ప్రస్తుతం, ఈ వెటరన్‌ డైరెక్టర్‌ తన మళ్లీ “కంఫర్ట్ జోన్”లోకి అడుగుపెడుతున్నాడట. అదే అంటే – ఒక కొత్త తరానికి సరిపోయే ప్రెజెంట్-డే లవ్‌స్టోరీ. ‘సఖి’ (2000), ‘ఓకే బంగారం’ (2015) లాంటి ప్రేమకథలతో మణిరత్నం గతంలో ఎలాంటి మ్యాజిక్ చేశాడో గుర్తుందా? ఇప్పుడూ అదే మ్యాజిక్ రిపీట్ కానుందన్న అంచనాలు మొదలయ్యాయి.

ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలో ఉన్నా… నటీనటుల చర్చలు అప్పుడే ఊపందుకున్నాయి. హీరోగా సింబు పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ, నవీన్ పొలిశెట్టి కూడా ఓ స్ట్రాంగ్ కంటెండర్‌గానే వినిపిస్తున్నాడు. హీరోయిన్‌గా మాత్రం ప్రస్తుతం రుక్మిణి వసంత్‌ పేరు హాట్ టాపిక్‌గా మారింది. అయితే, మణిరత్నం స్క్రిప్ట్‌కు తగిన వారిని చివరి నిమిషంలో ఎన్నుకుంటాడన్నది తెలిసిన విషయమే కాబట్టి, ఫైనల్‌ కాస్టింగ్‌పై ఇప్పట్లో స్పష్టత రానప్పటికీ… ఆసక్తికరంగా మారింది.

మణిరత్నం ఇటీవలి కాలంలో “థగ్ లైఫ్”పై స్పందిస్తూ ఓపెన్‌గా ప్రేక్షకుల నిరాశను అంగీకరించడం ఒక సాహసమే. కానీ ఇప్పుడు తన అసలైన శక్తి అయిన ప్రేమకథల వైపు మళ్లడం చూస్తే, ఇది కేవలం ఒక సినిమా కదలిక కాదు – ఇది మణిరత్నం మార్క్‌కు తిరిగి దారితీసే కొత్త దారి.

లవ్ స్టోరీలు అంటే మణిరత్నం స్పెషలిస్టే. ఎమోషన్, విజువల్స్, మ్యూజిక్ అన్నింటినీ కలిపి, ప్రేమకు కొత్త నిర్వచనాలిచ్చిన మాస్టర్‌కే ఇప్పుడు మళ్లీ గౌరవంగా తిరిగి రావాల్సిన సమయం ఇది.

Similar Posts