
రష్మిక పెళ్లిపై ‘చీప్’ కామెంట్స్: మాజీ ప్రియుడి ఫ్రెండ్‌కు చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్.. మైండ్ బ్లాక్ రియాక్షన్స్!
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ‘విరోష్’ (VIROSH) వెడ్డింగ్‌కు టైం దగ్గరపడుతుంటే, ఎక్కడి నుంచో అన్-వాంటెడ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి! ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతుంటే, రష్మిక ఎక్స్-బోయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి గ్యాంగ్ మళ్ళీ సీన్లోకి వచ్చింది. రక్షిత్ ఫ్రెండ్ ప్రమోద్ శెట్టి చేసిన కొన్ని ‘వ్యాగ్యపు’ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. రష్మిక ఫ్యాన్స్ అయితే అసలు తగ్గడం లేదు.. ప్రమోద్ శెట్టికి పక్కాగా ‘మైండ్ బ్లాక్’ అయ్యే రేంజ్లో కౌంటర్లు ఇస్తున్నారు!
ఏంటి ఆ ‘చీప్’ కామెంట్స్?
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రమోద్ శెట్టి మాట్లాడుతూ.. రష్మిక పెళ్లి గురించి వ్యంగ్యంగా నవ్వుతూ కొన్ని మాటలు అన్నాడు. “నాకు ఇంకా ఇన్విటేషన్ అందలేదు. ఒకవేళ వస్తే వెళ్తాను.. కానీ ఆమె మమ్మల్ని పిలవదని తెలుసు, అది మాకు కొత్తేం కాదు” అంటూ సెటైర్లు వేశాడు. అంతటితో ఆగకుండా, “రక్షిత్ శెట్టి చాక్లెట్ తినే పిల్లాడేం కాదు.. బ్రేకప్ అయిందని బాధపడుతూ కూర్చోవడానికి” అంటూ కాస్త వెటకారాన్ని జోడించాడు.
ఫ్యాన్స్ ‘వైల్డ్’ రియాక్షన్.. అంకుల్ మెచ్యూరిటీ ఎక్కడ?
ప్రమోద్ కామెంట్స్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? “బ్రేకప్ అయి ఏళ్లవుతుంటే.. ఇంకా ఆమె పెళ్లికి నిన్ను ఎందుకు పిలవాలి బ్రో?” అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. “బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడిని, అతని ఫ్రెండ్స్‌ని పిలిచే ఆచారం ఎక్కడైనా ఉందా?” అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే “ఈ అంకుల్‌ను కర్ణాటక బయట ఎవరికి తెలుసు? రక్షిత్‌కు ఇలాంటి చప్రీ ఫ్రెండ్స్ ఉండబట్టే ఆ బంధం విడిపోయిందేమో” అంటూ పీక్స్ లో ట్రోల్ చేస్తున్నారు.
అసలు కథ ఇదీ..
2017లో రష్మిక, రక్షిత్ శెట్టిల ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగింది. అప్పుడు రష్మిక వయసు కేవలం 21 ఏళ్లే! కానీ 2018లో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఆ బంధం రద్దయ్యింది. అప్పటి నుంచి కన్నడ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పెళ్లి టైంలో కూడా ఇలాంటి ‘చీప్’ కామెంట్స్ చేయడంతో రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఫైర్ లో ఉన్నారు.
అవతలి వాళ్లు లైఫ్ లో సెటిల్ అవుతుంటే ఇలాంటి కామెంట్స్ చేయడం ఏమాత్రం మెచ్యూరిటీ కాదని జెన్ జీ కుర్రాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా రష్మిక మాత్రం దేన్నీ పట్టించుకోకుండా తన ‘రౌడీ’తో కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయింది. మరి ఈ ప్రమోద్ శెట్టి కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అతను చేసింది కరెక్టేనా? లేక ఫ్యాన్స్ ఇస్తున్న కౌంటర్లకే మీ ఓటా? కింద కామెంట్ సెక్షన్లో మీ మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్స్ చేసేయండి!
