సినిమా వార్తలు

మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్: నిహారిక విడాకుల వెనుక అసలు నిజం ఇదే!

పెళ్లయిన ఏడాదికే విడిపోవాలని ఎవరూ అనుకోరు.. కానీ మెగా డాటర్ నిహారిక జీవితంలో ఆ చేదు నిజం ఎదురైంది! విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత, తన మాజీ భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఇప్పుడు ఎలాంటి సంబంధం ఉందో నిహారిక బయటపెట్టింది. అసలు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నాగబాబు ఏమన్నారు? ఇప్పుడు వారిద్దరి మధ్య కాంటాక్ట్ ఉందా లేదా? ఈ సంచలన విషయాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్, యాంకరింగ్, హీరోయిన్‌గా సత్తా చాటిన ఈమె, ప్రస్తుతం “పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్” అధినేతగా “రాకాసా” సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

జొన్నలగడ్డ వెంకట చైతన్యతో వివాహం జరిగిన ఏడాదికే విభేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. విడాకుల నిర్ణయం గురించి నిహారిక మాట్లాడుతూ.. ఈ విషయం ముందుగా తన తండ్రి నాగబాబుకే చెప్పానని వెల్లడించారు. “నువ్వు సంతోషంగా లేనప్పుడు ఎక్కడా ఉండాల్సిన అవసరం లేదు” అని ఆయన మద్దతుగా నిలిచినట్లు ఆమె చెప్పుకొచ్చారు. వారి మధ్య వచ్చిన విభేదాలు సవరించలేనివని, అందుకే విడిపోవడమే మంచిదని ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

అయితే విడాకుల తర్వాత మాజీ భర్తతో ఫ్రెండ్‌గా అయినా కాంటాక్ట్‌లో ఉన్నారా? అన్న ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ.. “అలాంటిదేమీ లేదు, ఎక్కడా కాంటాక్ట్స్ లేవు” అని తేల్చి చెప్పారు. ఒకరినొకరు కొట్టుకుని విడిపోతే ఆ బాధ త్వరగా మర్చిపోతామని, కానీ ఇలా విడిపోతే ఆ బాధ నుండి బయటపడటం చాలా కష్టమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిహారిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వృత్తిపరంగా నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్న నిహారిక, తన వ్యక్తిగత జీవితంలోని చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ముందడుగు వేస్తున్నారు. ఏప్రిల్ 3న విడుదల కాబోతున్న “రాకాసా” సినిమాతో ఆమె మరో విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి.

Similar Posts