సంక్రాంతి 2026 టాలీవుడ్‌లో అసలైన యుద్ధానికి వేదికైంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఐదు సినిమాలు పోటీ పడుతుండటంతో లెక్కలు తలకిందులవుతున్నాయి. జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ అయిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ప్రస్తుతం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) ప్రభంజనం సృష్టిస్తుండటంతో, ప్రభాస్ సినిమాకి గట్టి పోటీ ఎదురవుతోంది.

బాక్సాఫీస్ వార్:

రెండు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన ‘అనగనగా ఒక రాజు’, నిన్న రిలీజైన ‘నారి నారి నడుమ మురారి’ కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నాయి.

కలెక్షన్ల డ్రాప్: రెండో రోజే మిశ్రమ స్పందన రావడంతో ‘ది రాజా సాబ్’ కలెక్షన్లు కొంత తగ్గుముఖం పట్టాయి. నార్త్ అమెరికా మరియు ఇతర ఓవర్సీస్ మార్కెట్లలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది.

ఆశలన్నీ ఆ మూడు రోజుల పైనే:

సంక్రాంతి పండగ మొదలవ్వడంతో, ఈ రోజు నుండి వచ్చే మూడు రోజులు సినిమాకు అత్యంత కీలకం. ఏపీలో పండగ పూట కలెక్షన్లు పుంజుకోవడం ఆనవాయితీ, అదే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. సంక్రాంతి శెలవలు మరో మూడు రోజులు ఉండటంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నష్ట నివారణే లక్ష్యం:

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు భారీగా పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ పండగ మూడు రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడితే, ఆ నష్టాల తీవ్రతను కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంది.

దర్శకుడు మారుతి మార్క్ హారర్-కామెడీ, ప్రభాస్ వింటేజ్ లుక్స్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ గ్లామర్ ఈ పండగ సీజన్‌లో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

#Mana Sankara VaraPrasad Garu, #Prabhas, #sankranthi 2026, #The Raja Saab, #The Raja Saab Collections

By admin