ఒకప్పుడు భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా టాలీవుడ్‌ని షేక్ చేసిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు తన ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే మళ్లించారు. అయితే, ఆయన నటించిన పాత కమిట్మెంట్స్ మాత్రం ఇంకా విడిచిపోలేదు. వాటిలోనే మొదటిగా నిలిచినదే… హరి హర వీరమల్లు.
కరోనా కూడా రాకముందే ప్రారంభమైన ఈ సినిమా… ప్రొడక్షన్ దశలో ఐదేళ్లు గడిచిపోయాయి. దాంతో సినిమాకు బడ్జెట్ విపరీతంగా పెరిగింది. మొత్తానికి ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుందన్నారు. కానీ… మళ్లీ ఓ షాకింగ్ టర్న్. CG వర్క్ పూర్తి కాలేదన్న కారణంతో సినిమా జులైకి వాయిదా పడింది.
నిర్మాత ఒత్తిడి… పవన్ కళ్యాణ్ సహాయం
ఈ వాయిదా వల్ల నిర్మాత ఏఎమ్ రత్నం మీద మళ్లీ ఆర్థిక ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే ఐదేళ్లుగా ఈ ప్రాజెక్ట్ మీదే డిపెండ్ అయిన నిర్మాతకు… ఇప్పుడు ప్రతి వాయిదా ఓ నష్టం. అందుకే పవన్…ముందుకు వచ్చారు. “నిజమైన స్టార్ అంటే ఇలా ఉండాలి!” అనేలా… పవన్ తన రెమ్యూనరేషన్లో తీసుకున్న రూ.11 కోట్ల అడ్వాన్స్ నిర్మాతకి తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇది నిర్మాత రత్నంకు ఎంతో ఊరటనిచ్చే విషయం.
సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.75 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే పవన్… ఈ సినిమాకి మాత్రం రూ.50 కోట్లకే ఓకే చెప్పాడు. అందులో భాగంగా రూ.11 కోట్లు అడ్వాన్స్ తీసుకున్న పవన్, తాను నిర్మాతను కాపాడాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ మొత్తం తిరిగి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాడు.