
‘ఓజీ’తో పవన్ కళ్యాణ్‌ని కొత్త స్టైల్లో చూపించి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ సుజీత్ ఇప్పుడు తన తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.
‘రన్ రాజా రన్’తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, తర్వాత ప్రభాస్‌తో చేసిన ‘సాహో’, ఇప్పుడు పవన్‌తో చేసిన ‘ఓజీ’ – ఇవన్నీ సీరియస్ యాక్షన్ డ్రామాలే. కానీ, సుజీత్ మనసు మాత్రం ఫన్ ఫిల్మ్స్ మీదే ఉన్నట్టు చెబుతున్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ –
“నెల్సన్ సినిమాలు చూసినప్పుడల్లా మన దగ్గర కూడా అలాంటి ఫన్ మూవీస్ చేయాలని అనిపిస్తుంది. యాక్షన్ ఫిల్మ్స్‌లో పని చేస్తూ చాలా సీరియస్ అవుతాం. కానీ ఫన్ సినిమాలు మాత్రం రిపీట్ విలువతో ఉంటాయి” అని చెప్పాడు.
ఇక ఈ కోణంలోనే ఆయన నెక్స్ట్‌ను డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్గా ప్లాన్ చేస్తున్నాడట.
ఇదే సమయంలో ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే — నాని, సుజీత్ కాంబో కుదిరిందట. ఈ ప్రాజెక్ట్‌ను దసరా సందర్భంగా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్.
ఇక పెద్ద ట్విస్ట్ ఏమిటంటే –
అందరూ ఊహించినట్టుగా యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కాకుండా, ఈ నాని–సుజీత్ కాంబో సినిమా విట్టీ డార్క్ కామెడీతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కలిగిన ఎంటర్‌టైనర్ అవుతుందని బజ్!
స్క్రిప్ట్ రెడీగా ఉందని, మొత్తం షూట్‌ని యూరప్‌లో ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలన్న ప్లాన్తో ఉన్నారని సమాచారం.
