
బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ ‘పెద్ది’ బిజినెస్ అరాచకం: ప్రభాస్, పవన్‌లకు సాధ్యం కానిది చరణ్ చేసి చూపించాడు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా వినిపిస్తున్న ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ఏడాది తెలుగు మార్కెట్‌లో మరే ఇతర బిగ్ మూవీకి సాధ్యం కాని రీతిలో ‘పెద్ది’ భారీ బిజినెస్ చేస్తోంది.
ఏడాదిలోనే బిగ్గెస్ట్ డీల్.. ప్రభాస్, చిరంజీవి సినిమాల కంటే ఎక్కువే!
ఈ ఏడాది ఇప్పటికే ప్రభాస్ ‘రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వంటి భారీ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ‘రాజా సాబ్’ నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకోగా.. ‘పెద్ది’ మాత్రం డిస్ట్రిబ్యూటర్ల దగ్గర భారీ ధర పలుకుతోంది.
రికార్డ్ బిజినెస్: తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లకు పైగా పలుకుతుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
తగ్గేదేలే: చిరంజీవి సినిమా బిజినెస్ రేంజ్ కంటే ‘పెద్ది’ చాలా ముందంజలో ఉంది.
పవన్ ‘ఉస్తాద్’ కంటే కూడా పైనే!
సమ్మర్ రేసులో రామ్ చరణ్ కంటే ముందు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ఉన్నప్పటికీ.. మార్కెట్ టాక్ ప్రకారం ‘పెద్ది’ క్రేజ్ ముందు ‘ఉస్తాద్’ కాస్త వెనకబడిందనే చెప్పాలి. ట్రేడ్ కోటేషన్స్ లో చరణ్ సినిమా ధరలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
రెండో హాఫ్ అంతా చరణ్ దే!
ఈ ఏడాది సెకండాఫ్ లో మరే ఇతర టైర్-1 స్టార్ల సినిమాలూ షెడ్యూల్ కాలేదు. దీంతో ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న ‘పెద్ది’కి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రన్ దక్కబోతోంది. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, చరణ్ రగ్గడ్ లుక్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి.
