గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్, నారా లోకేశ్‌ల లపై వ్యంగ్యంగా , ఇబ్బంది పెట్టే విధంగా మార్ఫింగ్‌ చిత్రాలతో ఎక్స్‌లో ట్వీట్లు పెట్టారు. దీనిపై తెదేపా మద్దిపాడు మండల పార్టీ కార్యదర్శి ఎం.రామలింగం ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్‌ 10న ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విచారణ శుక్రవారం జరగింది.

రామ్ గోపాల్ వర్మ విచారణ సందర్భంగా పోలీసులు మోహరించారు. ఒంగోలు గ్రామీణ సర్కిల్‌ కార్యాలయం వద్ద మద్దిపాడు, సంతనూతలపాడు ఎస్సైలు శివరామయ్య, వి.అజయ్‌బాబు ఆధ్వర్యంలో సిబ్బంది భారీగా మోహరించారు.

ప్రత్యేక రోప్‌లను సైతం సిద్ధం చేశారు. సర్కిల్‌ కార్యాలయంలో పరిసరాల్లో మీడియా తప్ప ఇతరులు ఎవరినీ అనుమతించలేదు.

అక్కడ చేరిన ప్రైవేట్‌ వ్యక్తులను పంపించి వేశారు. సమీపంలోని దుకాణాలను కూడా మూసివేయించారు.

పాత జాతీయ రహదారి పైవంతెన వద్ద నుంచి రామ్‌గోపాల్‌ వర్మ వాహనం సజావుగా వచ్చేందుకు వీలుగా సర్వీసు రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ఇతరులు రాకుండా పోలీసు వాహనం అడ్డుగా పెట్టారు.

,
You may also like
Latest Posts from