ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ నిలేశ్ చోప్రా అనే వ్యక్తి హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు పట్టుపడటం జరిగింది. పట్టుబడ్డ ఆ వ్యక్తి తాను ప్రముఖ బ్యానర్ వైజయంతీ మూవీస్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారని వార్తలు రావడంతో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
ఈ క్రమంలో తాజాగా వైజయంతీ మూవీస్ ఎక్స్ పేజీ ద్వారా స్పందించింది. నిలేశ్ చోప్రా ఎవరో తమకు తెలియదని , అలాంటి పేరుతో ఉన్న వ్యక్తి తమ వద్ద ఎప్పుడు కూడా పనిచేయలేదని పేర్కొంది.
‘‘ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నిలేశ్ చోప్రా అనే వ్యక్తిని ఎస్.ఆర్.నగర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. వైజయంతీ మూవీస్ కార్యాలయంలో అతడు ఎప్పుడూ వర్క్ చేయలేదు. అతడితో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈమేరకు పోలీసు అధికారులతో మేము చర్చించాం. ఏదైనా విషయాన్ని ప్రచురించే ముందు నిజానిజాలు చెక్ చేసుకోవాల్సిందిగా మీడియాను మేము కోరుతున్నాం’’ అని పేర్కొంటూ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.