రామ్ పోతినేని తదుపరి సినిమాపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది, అది కూడా ఒక మామూలు డైరెక్టర్‌తో కాదు.. ఇండియా మొత్తాన్ని ఊపేస్తున్న లోకేశ్ కనగరాజ్ కాంపౌండ్ నుంచి వస్తున్న ఒక టాలెంటెడ్ డైరెక్టర్‌తో రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లాక్ చేశాడు!
గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని , ఇప్పుడు తన మార్కెట్‌ను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ఒక భారీ స్కెచ్ వేశాడు. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫలితం నిరాశపరిచినప్పటికీ , చార్మ్ తగ్గకుండా తన తదుపరి అడుగును చాలా జాగ్రత్తగా ఆలోచించి వేశాడు. దాదాపు అరడజను కథలను కాదని , చివరకు కోలీవుడ్ సెన్సేషన్ లోకేశ్ కనగరాజ్ అసోసియేట్ చెప్పిన లైన్‌కు ఫిదా అయిపోయాడు.

చివరి సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం రామ్ ఎంతో కష్టపడ్డాడు , తన క్రియేటివ్ ఎఫర్ట్స్ అన్నీ పెట్టినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదు. దీంతో దాదాపు ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకున్న రామ్ , వైవిధ్యమైన కథల కోసం వేట మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే లోకేశ్ కనగరాజ్ వద్ద పని చేసిన ఒక యువ దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ రామ్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ ప్రాజెక్ట్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని , మేకింగ్ పరంగా సరికొత్త టెక్నాలజీని వాడబోతున్నారని సమాచారం. లోకేశ్ కనగరాజ్ సినిమాల్లో ఉండే ఆ గ్రిప్పింగ్ నరేషన్ , ఇంటెన్సిటీ ఈ సినిమాలోనూ ఉండబోతుండటంతో అభిమానుల్లో అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

రామ్ పోతినేని ఎనర్జీకి , లోకేశ్ శిష్యుడి మేకింగ్ స్టైల్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రామ్ మళ్ళీ తన పాత వైభవాన్ని అందుకుంటాడా? ఈ కొత్త దర్శకుడు ‘నెక్స్ట్ లోకేశ్ కనగరాజ్’ అవుతాడా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

