సినిమా వార్తలు

ఆర్జీవీ సైకాలజీని ఎవరైనా సైకాలజిస్టులకే చూపించాలి: మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) చేసే ట్వీట్లు, విమర్శలు గురించి తెలిసిందే. ఆయన మెగా క్యాంప్ పై అవకాసం ఉన్నప్పుడల్లా విరుచుకు పడుతూంటారు. ఈ విషయమై మెగాస్టార్ చిరంజీవి గతంలో తనదైన శైలిలో స్పందించారు. వర్మ చేసే కామెంట్లలో ఉండే ఎటకారంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ట్వీట్లను పట్టించుకోను..

రామ్ గోపాల్ వర్మ గురించి ప్రస్తావన రాగా, ఆయన నిరంతరం ట్వీట్లు చేస్తూనే ఉంటారని చిరంజీవి పేర్కొన్నారు. “ఆయన చేసే కామెంట్లను నేను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోను, జస్ట్ అలా బ్రష్ ఆఫ్ (పక్కన పెట్టడం) చేస్తూ ఉంటాను” అని చెప్పారు.

ఆయన నైజమే అది!

వర్మ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. “ఆయనకు ఉన్న నేచర్ ఏంటో ఎవరైనా సైకాలజిస్టులకే చూపించాలి. ఒకరిని పొగడాలి అనుకుంటే మరొకరిని తెగుడుతాడు, కించపరుస్తాడు. ఆయనలో ఎటకారాలు చాలా ఎక్కువ” అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

జేమ్స్ క్యామరూన్ ఆశ్చర్యపోతారా?

వర్మ ఎటకారానికి ఒక ఉదాహరణను కూడా మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. “ఖైదీ నెం. 150 సినిమాలో ‘అమ్మడు కుమ్ముడు’ సాంగ్‌లో నేను లుంగీతో ఉన్నది చూసి.. అవతార్ సినిమా తీసిన జేమ్స్ క్యామరూన్ వంటి గొప్ప దర్శకులు కూడా ఆశ్చర్యపోయి, తెలుగు ఇండస్ట్రీ ఇంత గొప్పదా అని అంటారని వర్మ ట్వీట్ చేశారు. అది పొగడ్తనో, ఎటకారమో అర్థం కాదు. ఆయన ఏ స్టేజ్‌లో ఉండి అటువంటి ట్వీట్లు పెడతారో నిజంగా నాకైతే అర్థం కాదు” అని చిరంజీవి నవ్వుతూ సమాధానమిచ్చారు.

మొత్తానికి వర్మ చేసే విమర్శలను చిరంజీవి లైట్ తీసుకున్నప్పటికీ, వర్మ ప్రవర్తనపై ఆయన చేసిన ‘సైకాలజిస్ట్’ కామెంట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Similar Posts