సినిమా వార్తలు

ఎన్టీఆర్ హీరోయిన్ కి చేదు అనుభవం..ముఖానికే కాదు.. అక్కడ కూడా మేకప్ వేయమన్నారు

తెలుగు తెరపై తన అందం, అభినయంతో ఒకప్పుడు ఊపేసిన సమీరా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ సరసన ‘నరసింహుడు’, ‘అశోక్’ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవ’లో ఆడిపాడిన ఈ భామ.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టి అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. ముఖ్యంగా రంగు, రూపం విషయంలో తనను ఎంతలా వేధించారో ఆమె పంచుకున్న విషయాలు నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

ముఖానికే కాదు.. ఆ పార్ట్స్ కి కూడా మేకప్!

సినిమా పరిశ్రమలో ఉన్న ‘తెల్లతోలు’ వ్యామోహం తనను ఎంతలా ఇబ్బంది పెట్టిందో సమీరా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన అసలు రంగు కంటే ఇంకా తెల్లగా కనిపించాలని, కేవలం ముఖానికే కాకుండా శరీరం ఎక్కడైతే బయటకు కనిపిస్తుందో అక్కడ కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేసేవారట. ఆ మాటలు విన్నప్పుడు తాను అసలు అందంగా ఉండనేమో అన్న ఫీలింగ్ వచ్చేదని సమీరా ఆవేదన వ్యక్తం చేసింది.

బాడీ షేమింగ్.. ఆత్మవిశ్వాసం కోల్పోయిన పరిస్థితి!

కేవలం రంగు మాత్రమే కాదు, తన బాడీ షేమింగ్‌పై కూడా దారుణమైన విమర్శలు వచ్చేవని సమీరా పేర్కొంది. ఎత్తు తక్కువగా ఉండటం వల్ల లావుగా ఉన్నానంటూ విమర్శించేవారని తెలిపింది. ఇక పెళ్లి తర్వాత మొదటి బిడ్డ పుట్టినప్పుడు పెరిగిన బరువు (పోస్ట్-పార్టమ్ వెయిట్ గైన్) తన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసిందని, అయితే రెండోసారి తల్లి అయినప్పుడు మాత్రం తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నానని స్పష్టం చేసింది.

వైట్ హెయిర్ పై దారుణమైన ట్రోల్స్!

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమీరా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తన తెల్లబడిన జుట్టుతో ఫోటోలు పెడితే నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేసేవారని, కానీ ఇప్పుడు తాను ఎవరికీ భయపడటం లేదని తేల్చి చెప్పింది. ఒకప్పుడు ఎన్టీఆర్ తో ఎఫైర్ వార్తలతో రచ్చ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

స్టార్ హీరోయిన్ గా ఉన్న టైంలోనే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయంటే, సినిమా గ్లామర్ ప్రపంచం వెనుక ఎన్ని కష్టాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

Similar Posts