తెలుగు సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా తన నటనతో అలరిస్తున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. రీసెంట్‌గా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు సినీ పరిశ్రమల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ముఖ్యంగా తమిళ ప్రజల దైవంగా భావించే ఎంజీఆర్ (MGR) పై రాజేంద్ర ప్రసాద్ వాడిన పదజాలం వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈ వ్యవహారంపై తమిళ హీరో విశాల్ ఘాటుగా స్పందిస్తూ వార్నింగ్ ఇచ్చారు.
ఎంజీఆర్ వణికిపోయేవారు.. ఉ పోసుకునేవారు!
కత్తి కాంతారావు జాతీయ పురస్కార ప్రధానోత్సవంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరించే క్రమంలో ఎంజీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడారు. అప్పట్లో కాంతారావు జానపద చిత్రాలను చూసి ఎంజీఆర్ వణికిపోయేవారని, ఆయనను చూస్తే ఎంజీఆర్ భయపడి ఉ* పోసుకుంటూ వెళ్లిపోయేవారని రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక లెజెండరీ నటుడు, మాజీ సీఎం గురించి ఇంత నీచమైన పదజాలం వాడటంతో తమిళ నెటిజన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
తమిళుల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎంజీఆర్ గారిని దారుణంగా అవమానించిన టీడీపీ మద్దతుదారుడు నటుడు రాజేంద్ర ప్రసాద్
— UttarandhraNow (@UttarandhraNow) March 10, 2026
వీరికి పద్మశ్రీ ఇచ్చిన ప్రభుత్వానికి 🙏🏻#TDP supporter #RajendraPrasad insults Greatest of all times #MGR.
சின்னத்திரை எம்ஜிஆரை அவமதித்த தெலுங்கு தேசம் கட்சி… pic.twitter.com/Nr1s54pFlU
విశాల్ సీరియస్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే!
రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. “మీరు కాంతారావు గారిని పొగడడంలో తప్పు లేదు, కానీ ఎంజీఆర్ లాంటి దైవ సమానమైన వ్యక్తిని కించపరచడం కరెక్ట్ కాదు. మీ మాటలు తమిళ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. వెంటనే మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి” అంటూ విశాల్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే సహించేది లేదని అల్టిమేటం జారీ చేశారు.
అలవాటుగా మారిన నోరు జారడం?
Shocking and repelling to see and hear the recent comments of senior actor Shri Rajendra Prasad, senior actor of our Telugu film industry at a recent function.
— Vishal (@VishalKOfficial) March 12, 2026
Dear Sir, with utmost regards and at the same time with a heavy heart, I pen down this tweet condemning your speech…
గతంలో కూడా రాజేంద్ర ప్రసాద్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను, తోటి నటులు అలీ, బ్రహ్మానందాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ అయ్యాయి. ఆ తర్వాత సారీ చెప్పడం ఆయనకు పరిపాటిగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. సీనియర్ నటుడిగా గౌరవించాల్సిన వ్యక్తి, పదే పదే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మరి విశాల్ డిమాండ్ కు రాజేంద్ర ప్రసాద్ ఎలా స్పందిస్తారో, ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిస్తారో లేదో చూడాలి. సినిమా ఈవెంట్లలో మైక్ దొరికితే చాలు ఏది పడితే అది మాట్లాడటం ఇప్పుడు నటీనటులకు ఒక బ్యాడ్ హ్యాబిట్ గా మారిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

