అక్కినేని నాగ చైతన్య రెగ్యులర్ చాక్లెట్ బోయ్ తరహాలో కాకుండా పాకిస్తాన్‌లో ఖైదు అయిన భారతీయ మత్స్యకారుడు రాజు పాత్రలో మాసీగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రియల్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న తండేల్ చిత్రం మరో రెండు రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చేసిన ప్రమోషన్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ బయిటకు వచ్చాయి.
‘తండేల్’ సినిమాకు భారీ బడ్జెట్ అయ్యిందని.. అయితే, ఈ చిత్ర ఓటీటీ రైట్స్ రూపంలో సగానికంటే ఎక్కువగా రికవర్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
‘తండేల్’ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది.
తండేల్ చిత్రం రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది.
గతంలో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’లో చైతన్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సాయి పల్లవి మళ్లీ తండేల్‌లో చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సాయిపల్లవి నటన, డ్యాన్సులు యూనిక్ గా అలరిస్తాయని అభిమానులు భావిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 100 పర్సంట్ లవ్ తర్వాత బన్నివాసు- చైతన్య- దేవీశ్రీ కాంబినేషన్ చిత్రమిది.