హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ భూముల వివాదం రోజు రోజుకీ పెద్దదవుతోంది.ఈ ఘటనపై ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్ లు దాఖలయ్యాయి. సెలబ్రెటీలు సైతం ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా దీనిపై తనదైన శైలిలో స్పందించారు. అసలు హైదరాబాద్లో ఏంజరుగుతుందని ఫైర్ అయ్యారు.

హైదరాబాద్ హెచ్ సీయూ ఫారెస్ట్ భూముల వివాదం ప్రస్తుతం దేశంలో హట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఓవర్ నైట్ లో యాభైకుపైగా జేసీబీలతో రాత్రికి రాత్రేహెచ్ సీయూలో ఉన్న అడవిని చదును చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో దీన్ని విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాలనేతలు కూడా తమ నిరసనలు తెలిపారు .

Prakash Raj
ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ ఘటనపై..సమంత, నాగ్ అశ్విన్, ప్రకాష్ రాజ్, ఉపాసన కొణిదెలా, రేణు దేశాయ్ లు స్పందించారు. ఆ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక సైతంస్పందించారు. తన సోషల్ మీడియా అకౌంట్లో సంచలన పోస్ట్ పెట్టారు. అసలు హైదరాబాద్ లో ఏంజరుగుతుందన్నారు. తాను ఇప్పుడే ఈ ఘటనను చూశానన్నారు. అసలు ఆ జేసీబీలేంటీ.. విద్యార్థులను అరెస్టు చేయడమేంటనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Rashmika

ఈ ఘటనతో తన గుండె ముక్కలైందని.. నిజంగా ఇది ఎంత మాత్రం సరైన పనికాదని,దీనిపై మళ్లీ ఆలోచించాలని రష్మిక మందన్న సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో రష్మిక చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

rashmika4

Sreeleela
స్వార్థాన్ని నరికివేయండి, చెట్లను కాదు, ప్రకృతిని కాపాడండి, ప్రతి వన్యప్రాణి మన మనుగడకు ప్రధానమే అనే రైటింగ్స్‌లో కూడిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకుంది శ్రీలీల.

Renu Desai

సీనియర్‌ నటి రేణూదేశాయ్‌ మరోమారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ‘ప్రజలందరి పక్షాన ఈ వీడియో ద్వారా సీఎం రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు రెండు రోజుల క్రితం హెచ్‌సీయూ ఘటనల గురించి తెలిసింది. మిత్రుల ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి ఈ వీడియోతో ముందుకొచ్చాను. సీఎంగారు..ఓ తల్లిగా నేను మిమ్మల్మి అభ్యర్థిస్తున్నా. మన భవిష్యత్తు తరాల కోసం ఆక్సిజన్‌, చెట్లు అవసరమవుతాయి.

ఐటీ పార్కులు, ఆకాశహర్మ్యాలతో కూడిన అభివృద్ధి అవసరమే.. కానీ ఈ 400 ఎకరాల భూమిని మాత్రం వదిలివేయమని మిమ్మల్ని కోరుతున్నా. తెలంగాణలో నివసిస్తున్న పౌరురాలిగా మీకు నా అభ్యర్థన ఇది. అభివృద్ధి చేయాలంటే ఇతర ప్రాంతాల్లో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.

ఆక్సిజన్‌ కోసం మనకు చక్కటి పర్యావరణం అవసరం కాబట్టి ఆ 400 ఎకరాలను వదిలిపెట్టమని అడుగుతున్నా. హెచ్‌సీయూ భూముల వేలం విషయంలో మీరు, మీ అధికారులందరూ పునరాలోచన చేసి మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. మరో పోస్ట్‌లో… కోర్టు ఆదేశాలను ధిక్కరించి బుధవారం సాయంత్రం కూడా అటవీ ధ్వంసం చేశారని రేణూదేశాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

vara Lakshmi Sarath kumar

గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యం, వన్యప్రాణులకు సంబంధించిన వీడియోను కథానాయిక వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంది. ‘సేవ్‌ సిటీ ఫారెస్ట్‌’ అనే సంస్థ పోస్ట్‌ను కూడా షేర్‌ చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ వెంటనే ఈ విధ్వంసానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

అటవీ నిర్మూలన వల్ల కంచె గచ్చిబౌలిలో 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని ఎకలాజికల్‌ హెరిటేజ్‌ సంస్థ రిపోర్టును ఉటంకిస్తూ ‘తెలంగాణ టుడే’ పత్రిక పబ్లిష్‌ చేసిన ఆర్టికల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది సమంత. దీనితో పాటు అటవీ విధ్వంసం సందర్భంగా నెమళ్లు, జింకలు అరుస్తున్న వీడియోను సైతం తన ఖాతాలో షేర్‌ చేసింది.

Regina Cassandra

హెచ్‌సీయూ విద్యార్థుల నిరసనలు, బుల్డోజర్లతో అటవీ నేలమట్టం తాలూకు వరుస వీడియోలు, నెమళ్ల ఆక్రందనల వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకుంది రెజీనా కాసాండ్రా. వేలానికి వ్యతిరేకంగా వివిధ ఆంగ్ల పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా పంచుకుంది. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే ఈ పనులను వెంటనే నిలిపివేయాలని కోరింది.

Dia Mirza

‘ప్రకృతి సంపదను పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించాలనే తపనతో విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. ఐటీ పార్కులకంటే అడవిని కాపాడుకుంటేనే రేపటి మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తూ దానినే అభివృద్ధి అనుకుంటే చివరకు అది విధ్వంసానికి దారితీస్తుంది’ అంటూ సీనియర్‌ హీరోయిన్, హైదరాబాద్‌కు చెందిన దియా మిర్జా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆవేదన వ్యక్తం చేసింది.

, , , , , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com