సుధీర్ బాబు తొలి పాన్ ఇండియా సినిమా “జటాధర” నవంబర్ 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి తెలుగులో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు ₹6 కోట్లు రూపాయలకు క్లప్లింట్ అయ్యిందని సమాచారం. మొత్తం వరల్డ్‌వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు ₹8 కోట్లు అని తెలుస్తోంది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో మంచి రికవరీ అవుతుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, యుమేష్ కుమార్ బన్సాల్, శివమ్ నారంగ్, బ్రూనా అగర్వాల్, ప్రేరణ అరోరా, షబీర్ షేక్, నిఖిల్ నందా సంయుక్తంగా నిర్మించారు. జీ స్టూడియోస్ మరియు ప్రేరణ అరోరా బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ రూపొందింది.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ నవంబర్ 1న సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాదులోని అవాసా హోటల్‌లో జరుగుతుంది.

ముఖ్య పాత్రలో నటించిన సుధీర్ బాబుతో పాటు, శక్తిమంతమైన దైవ స్వరూప పాత్రలో కనిపించనున్న సోనాక్షి సిన్హా ఇప్పటికే పోస్టర్లతో మంచి బజ్ సృష్టించారు. శిల్పా శిరోధ్కర్, దివ్య పిళ్లై, సాయి కుమార్ తదితర నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మిస్టిక్ విజన్స్, శక్తి – ఆధ్యాత్మికత కలగలిపిన ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా కనిపిస్తోంది.

, , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com