తన కెరీర్‌లో మళ్లీ పెద్ద సక్సెస్ ని అందుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నతమిళ స్టార్ హీరో సూర్య, ఈసారి ఓ విభిన్న ప్రయోగానికి రెడీ అయ్యారు. హాస్య నటుడిగా, రేడియో జాకీగా పేరు తెచ్చుకున్న ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. ఇది “సూర్య 45″గా గత కొంతకాలంగా ప్రచారంలో ఉండగా… ఇప్పుడు అధికారికంగా సినిమా టైటిల్‌ను ప్రకటించారు.
సూర్య కొత్త సినిమా పేరు – ‘కరుప్పు’
చిత్ర టీమ్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌తో పాటు, సూర్య స్వయంగా ఆర్జే బాలాజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ టైటిల్‌ను షేర్ చేశారు. ‘కరుప్పు’ (Karuppu) అనే పేరుతో ఈ సినిమాను ప్రకటించగా… ఈ టైటిల్ తమిళంలో మంచి ఆసక్తిని రేపుతోంది.
ఫాంటసీ + యాక్షన్ + ఎమోషన్ – మాస్ కంటెంట్!
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది మరెవరో కాదు… ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్!
ఫాంటసీ యాక్షన్ నేపథ్యంలో ఈ కథ సాగనుందని, దాదాపు ఏడాదికి పైగా కథపై కసరత్తులు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఆర్జే బాలాజీ – మల్టీ టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్
రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించిన బాలాజీ, నటి నయనతారతో చేసిన ‘అమ్మోరు తల్లి’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సత్యరాజ్‌తో ‘వీట్ల విశేషం’ అనే సినిమా చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి… స్టార్ హీరో సూర్యను డైరెక్ట్ చేస్తున్నారు!
ఈ సినిమా టైటిల్ “కరుప్పు” ఉండటంతో… ఇది సామాజికంగా సంచలనం రేపే అంశాల్ని ప్రస్తావించేలా ఉందా? లేక డార్క్ ఫాంటసీ జానర్ లో నడుస్తుందా? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.