మారన్‌ బ్రదర్స్‌ మధ్య ‘లీగల్‌ వార్’.. మనీలాండరింగ్‌ ఆరోపణలతో కుటుంబ వివాదం రచ్చకెక్కింది!

సన్‌ టీవీ ఛైర్మన్‌ కళానిధి మారన్‌కు, ఆయన సోదరుడు – కేంద్ర మాజీ మంత్రి, డీఎంఎకె ఎంపీ అయిన దయానిధి మారన్ నుంచి షాకింగ్ లీగల్ నోటీసులు అందాయి. వారిద్దరి మధ్య కొనసాగుతున్న అంతర్గత కుటుంబ కలహం ఇప్పుడు నేరుగా న్యాయపోరుగా మారింది.

కళానిధిపై సంచలన ఆరోపణలు

దయానిధి మారన్ తరఫున లాయర్ కె. సురేశ్ జూన్ 10న పంపిన నోటీసుల్లో…కళానిధి మారన్ పలు మోసపూరిత ఆర్థిక వ్యవహారాలు నిర్వహించారని,మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని,కంపెనీలో వాటాల తీరును 2003లో ఉన్న పరిస్థితికి మళ్లించాలని డిమాండ్ చేశారు.

ఇంతటితో కాకుండా, ఈ నోటీసులో ఎస్‌ఎఫ్‌ఐఓ (Serious Fraud Investigation Office) రంగప్రవేశం చేయాలని, కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

కావేరి మారన్‌కి కూడా నోటీసులు

కళానిధితో పాటు, ఆయన సతీమణి కావేరి మారన్‌కూ నోటీసులు అందాయి. దీంతో సన్‌ నెట్‌వర్క్‌ పరువు పైనే ముసుగు పడినట్టైంది.

అయితే, ఇది ‘వ్యక్తిగత అంశం’ మాత్రమేనని… సన్‌ టీవీ నిర్వహణపై ఎలాంటి ప్రభావం ఉండదని సమాచారం. కానీ, దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మీడియా కుటుంబంలో ఇలా నేరుగా ‘కుటుంబ పోరు’ వెలుగులోకి రావడంతో, రాజకీయ మరియు పారిశ్రామిక వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇక ముందున్నది… న్యాయపోరాటమే!

మారన్ బ్రదర్స్ మద్య ఈ లీగల్ వార్ ఎంతదాకా వెళుతుందో? ఎలాంటి షాకింగ్ రివలేషన్స్ వెలుగులోకి వస్తాయో చూడాలి.

ప్రముఖ మీడియా సామ్రాజ్యంలో మొదలైన ఈ రహస్య యుద్దం… ఇక ఓపెన్ బాటిల్‌లా మారిందని చెప్పవచ్చు!

#Dananidhi Maran, #Kalanithi Maran, #Sun Pictures

By admin