సినిమా వార్తలు

“నా న్యూడ్ వీడియోలుతో బెదిరించారు!,పోసాని నా పెళ్లికి అడ్డుపడ్డారు”: పూనమ్ కౌర్ సంచలన నిజాలు ?

టాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ కౌర్ మళ్ళీ వార్తల్లో నిలిచారు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ‘గురువు’ అంటూ పరోక్షంగా త్రివిక్రమ్‌పై, పవన్ కళ్యాణ్‌పై పోస్ట్‌లు పెట్టి దుమారం రేపిన ఈమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు టాలీవుడ్‌ని షేక్ చేస్తున్నాయి. తన జీవితాన్ని నాశనం చేయడానికి ఏకంగా 15 కోట్లు ఖర్చు చేశారని ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

న్యూడ్ వీడియోలతో బెదిరింపులు.. కడప బ్యాచ్ ఎంట్రీ!

పూనమ్ కౌర్ వెల్లడించిన అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. ఆమెను కొందరు వ్యక్తులు దారుణంగా బ్లాక్ మెయిల్ చేశారట. ” కొందరు వ్యక్తులు నన్ను కలిశారు. ఒక పెద్ద నటుడికి వ్యతిరేకంగా మాట్లాడాలని నాపై ఒత్తిడి తెచ్చారు. దానికి ఒప్పుకోకపోతే నా న్యూడ్ వీడియోలు మార్కెట్‌లోకి వదులుతామని బెదిరించారు” అంటూ పూనమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మొదట డబ్బు, పవర్ ఆశ చూపించి.. లోబడకపోవడంతో ఇలాంటి నీచమైన పనులకు ఒడిగట్టారని ఆమె వాపోయారు.

“పోసాని వల్ల నా పెళ్లి ఆగిపోయింది.. జీవితం నాశనమైంది!”

నటుడు పోసాని కృష్ణమురళిపై పూనమ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడని, కానీ సరిగ్గా అదే సమయంలో పోసాని పెట్టిన ప్రెస్ మీట్ తన కొంప ముంచిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

“పోసాని నా గురించి అసత్యాలు, కట్టుకథలు చెప్పాడు. ఆ దెబ్బతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి వెనక్కి తగ్గాడు. నా పెళ్లి కోరిక అక్కడే చచ్చిపోయింది. నా ఆరోగ్యం, సంతోషం, కెరీర్ అన్నీ పోయాయి” అని పూనమ్ ఎమోషనల్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ ఇష్యూలో పెద్ద కుట్ర?

పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా పూనమ్ గతంలో చేసిన పోస్ట్‌ల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఇప్పుడు అర్థమవుతోంది. ప్రత్యర్థి పార్టీల నాయకులు తనను పావుగా వాడుకున్నారని, ఒక స్టార్ హీరో ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి తనను బలిపశువును చేశారని ఆమె పరోక్షంగా హింట్ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ అభిమానులు ఈ వీడియోలను వైరల్ చేస్తూ, పూనమ్ మీద గతంలో జరిగిన దాడుల వెనుక ఉన్నది ఎవరో తేలాలని డిమాండ్ చేస్తున్నారు.

తల్లిని కూడా వదల్లేదు.. గురుద్వారాలో అవమానం!

సినిమా ఇండస్ట్రీలోని ఒక పెద్ద మనిషి తనకు అన్యాయం చేశాడని, ఆయన దగ్గర డబ్బులు తీసుకుని పూనమ్ అమ్ముడుపోయిందని మీడియాలో కథనాలు వచ్చాయి.

దీనిపై స్పందిస్తూ.. “మా అమ్మ గురుద్వారాకు వెళ్తే.. ‘నీ కూతురిని డబ్బులకు అమ్మేశావా?’ అని అడిగారు. ఆ మాట విన్నప్పుడు చచ్చిపోవాలనిపించింది. దాసరి నారాయణరావు గారు ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు” అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

యాక్సిడెంట్.. బాడీ షేమింగ్.. చావు అంచుల దాకా!

అమెరికాలో తనకు పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని, దానివల్ల బాడీలో చాలా మార్పులు వచ్చి ముఖం ఉబ్బిపోయిందని పూనమ్ చెప్పారు. ఆ సమయంలో మీడియా తనపై చేసిన బాడీ షేమింగ్ వల్ల తాను మానసిక క్షోభ అనుభవించానని, “నిజంగా నేను మీడియా కథనాల వల్లే చచ్చిపోయాను” అంటూ తన బాధను వెళ్లగక్కారు.

మొత్తానికి పూనమ్ కౌర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమెను బెదిరించిన వాళ్లు ఎవరు? ఆ ‘పెద్ద నటుడు’ ఎవరు? అనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

మరిన్ని హాట్ టాలీవుడ్ గాసిప్స్ మరియు అప్డేట్స్ కోసం మా పేజీని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!

Similar Posts