సినిమా వార్తలు

అఫీషియల్: వెంకీ–త్రివిక్రమ్ మూవీకి ఇదే టైటిల్! ఫైనల్

వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్‌ సినిమా అనగానే టాలీవుడ్‌లో రోజూ కొత్త టైటిల్స్ వినిపిన్నాయి. “బంధు మిత్రుల అభినందనలతో…”, “పెళ్లి శుభాకాంక్షలు…”, ఇలా సోషల్ మీడియాలో ప్రతి రోజు ఒక కొత్త టైటిల్ వైరల్ అవుతూ వచ్చింది. ఈ ఊహాగానాలన్నింటికీ చెక్ పెడుతూ టీమ్ ఫైనల్‌గా అధికారిక టైటిల్‌ను ప్రకటించింది.

సినిమా టైటిల్: “ఆదర్శ కుటుంబం”
ట్యాగ్ లైన్ : “హౌస్ నం.47 (AK47)”

టైటిల్ ఒక్కటే మ్యాజిక్ చేసింది సూటిగా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వైబ్స్‌ను పకడ్బందీగా రివీల్ చేసింది.

మొదటి చూపు, మొదటి ఇంప్రెషన్: వెంకీ మిడిల్ క్లాస్ జనంలోకి

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత బజ్ క్రియేట్ చేసింది. వెంకటేశ్ సింపుల్ గెటప్‌లో, నేటివ్ మిడిల్ క్లాస్ మాన్‌గా కనిపిస్తూ… ఒక నవ్వు వెనుక దాచుకున్న బాధ, బాధ వెనుక దాచుకున్న ప్రేమ కనిపిస్తున్నట్టు ఫీలింగ్.

వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ ప్లాన్, షూటింగ్ ఈరోజే స్టార్ట్, అన్నది టీమ్ అప్‌డేట్.

ట్రివిక్రమ్ గతంలో “నువ్వు నాకు నచ్చావ్”, “మల్లీశ్వరి” స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు వెంకీ మ్యాజిక్‌ వర్కౌట్ అయ్యింది. ఇప్పడు డైరెక్టర్‌గానే మళ్లీ కలవడం – అంచనాలు రెట్టింపు!

ఇప్పటికే హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఫైనల్.

ఇది ఒక్కటి కాదు… వెంకీ లైనప్ చూస్తే షాక్!

ఈ సినిమా తర్వాత వెంకటేశ్ వరుసగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నాడు:

చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే “మన శంకర వరప్రసాద్” – ప్రత్యేక పాత్ర
“దృశ్యం-3” – సస్పెన్స్ తిరిగి

“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్‌బస్టర్ తర్వాత సోలో హీరోగా వెంకీ చేస్తున్న సినిమా ఇదే. అందుకే ఇంట్రెస్ట్ లెవెల్ మూమాలుగా లేదు.

Similar Posts