తమిళ సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన వార్త ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ (46) గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించి తుదిశ్వాస విడిచారు.

ఆఖరి క్షణాలు ఎలా జరిగాయి?

కాలేయం, కిడ్నీ సమస్యలతో పాటు ఇటీవల పచ్చకామెర్లు సోకడం ఆయన ఆరోగ్యాన్ని మరింత కుదించింది. గురువారం ఇంట్లోనే స్పృహ కోల్పోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడే వైద్యులు మరణం ధృవీకరించారు.

కుటుంబం

శంకర్‌కు భార్య ప్రియాంక, కుమార్తె ఇంద్రజ ఉన్నారు. ఇంద్రజ కూడా ‘బిగిల్’ ద్వారా నటిగా పరిచయమయ్యారు. అభిమానుల నివాళుల కోసం ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచారు. అంత్యక్రియలు ఈరోజే జరుగనున్నాయి.

నవ్వులు పంచిన ప్రస్థానం

స్టాండప్ కమెడియన్‌గా మొదలైన ఆయన ప్రయాణం, ‘కలక్క పావతు యారు’ షోతో పాపులర్ అయింది. రోబోలాగా డ్యాన్స్ చేసి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆపైన ‘మారి’, ‘విశ్వాసం’ లాంటి హిట్ సినిమాల్లో తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ‘సొట్టా సొట్టా ననైయుతూ’ ఆయన నటించిన చివరి చిత్రం.

కమల్ హాసన్ భావోద్వేగ నివాళి

“రోబో అనేది నీకు మారుపేరే కానీ, నువ్వు మనసున్న గొప్ప మనిషివి. నా చిన్న తమ్ముడిలాంటి వాడివి. నీ పని ముగిసిందని వెళ్లిపోతున్నావేమో, కానీ నా పని ఇంకా మిగిలే ఉంది. రేపు నువ్వు మమ్మల్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ రేపటి రోజు మాది” అని కమల్ హాసన్ రాసిన మాటలు అభిమానుల కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తున్నాయి.

, , , , ,
You may also like
Latest Posts from