
సంగీత్ కాదు… క్రికెట్!: విజయ్-రష్మిక పెళ్లి ముందు షాక్! మండపంలో కాకుండా గ్రౌండ్‌లో ఎంట్రీ?
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి హడావుడి ఇప్పుడు పీక్స్‌కు చేరింది! ఫిబ్రవరి 26న జరగబోయే ఈ రాయల్ వెడ్డింగ్ కోసం ఉదయ్‌పూర్ నగరం ముస్తాబైంది. అయితే, ఇది కేవలం పెళ్లి మాత్రమే కాదు.. అంతకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్ అని తెలుస్తోంది. పెళ్లి మండపంలో అడుగుపెట్టకముందే ఈ జంట చేస్తున్న పనులు చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! తాజాగా బయటకు వచ్చిన ఆ ‘స్పోర్టీ’ అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట రచ్చ రేపుతోంది.

పెళ్లిలో క్రికెట్ మ్యాచ్.. ఏంది సామీ ఇది!
సాధారణంగా పెళ్లిళ్లలో సంగీత్, మెహందీ వంటివి కామన్‌గా చూస్తాం. కానీ మన రౌడీ స్టార్ స్టైలే వేరు! పెళ్లి వేడుకల్లో భాగంగా విజయ్-రష్మిక ఫ్యామిలీల మధ్య ఒక ‘ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్’ ప్లాన్ చేశారు. ‘వీరోష్’ టీమ్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం గ్రౌండ్ కూడా సిద్ధమైందట. ఇప్పటికే పూల్ దగ్గర వాలీబాల్ ఆడుతూ రచ్చ చేసిన ఈ జంట, ఇప్పుడు బ్యాట్ పట్టి గ్రౌండ్‌లోకి దిగుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

జపనీస్ డిన్నర్.. దేశీ బ్రేక్‌ఫాస్ట్!
కేవలం ఆటలే కాదు, తిండి విషయంలోనూ ఈ జంట తగ్గేదేలే అంటున్నారు. మొన్న రాత్రి ప్రత్యేకంగా జపనీస్ డిన్నర్‌తో అతిథులను ఆశ్చర్యపరిచిన ఈ జంట, రేపు ఉదయం పక్కా దేశీ బ్రేక్‌ఫాస్ట్‌తో విందు ఇవ్వబోతున్నారట. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వెరైటీ వెరైటీ రుచులతో గెస్టుల నోరు ఊరిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

డ్రోన్లు కనిపిస్తే షూట్ అవుట్? కట్టుదిట్టమైన భద్రత!
విజయ్-రష్మిక పెళ్లి ఫోటోలు ఒక్కటి కూడా బయటకు రాకుండా ఉండేందుకు మేకర్స్ మామూలు ప్లాన్ వేయలేదు. పెళ్లి వేదిక చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. అనధికారికంగా ఎగిరే డ్రోన్లను అసలు అనుమతించకూడదని గట్టి రూల్ పెట్టారు. సీక్రెసీ మెయింటైన్ చేయడంలో బాహుబలి రేంజ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఇప్పటివరకు కేవలం కొన్ని హింట్స్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
అరిటాకు భోజనం, క్రికెట్ మ్యాచ్‌లు, జపనీస్ డిన్నర్లు.. ఇలా ‘వీరోష్’ పెళ్లి ఒక రేంజ్ లో సాగుతోంది. ఫిబ్రవరి 26న వీరిద్దరూ ఒక్కటి కాబోతున్న తరుణంలో, ఆ ఫోటోల కోసం ఇంటర్నెట్ అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. మన రౌడీ స్టార్ పెళ్లి పీటల మీద ఎలా ఉంటాడో చూడాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే! మరిన్ని ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!
