ఒక జమానా ఉన్నది – అప్పట్లో హీరో గోవిందా తెరపై కనిపించగానే థియేటర్లలో చప్పట్లతో కూడిన హర్షధ్వానాలు మిన్నంటేవి. డాన్స్, కామెడీ, యాక్షన్… ఏ కోణంలో చూసినా ఆయన ఒక పూర్తి ప్యాకేజీ హీరో. 90ల బాలీవుడ్‌కి ఓ ప్రత్యేకమైన ఊపునిచ్చిన నటుడిగా గుర్తింపు పొందిన గోవిందా… ఇప్పుడు వెండితెరకు చాలా దూరంగా ఉన్నారు. అయితే ఈ నష్టానికి అసలైన కారణం ఏమిటి? ఎందుకు గోవిందా లాంటి కామెడీ మెగాస్టార్ ఒక్కసారిగా వెనక్కి తగ్గిపోయారు? ఏం జరిగింది…. ప్రముఖ నిర్మాత, సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు పహ్లాజ్ నిహలానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“చుట్టూ ఉన్నవాళ్ల మాటలు వినడం వల్లే గోవిందా కెరీర్ పాడయింది!” – పహ్లాజ్ నిహలానీ

“గోవిందా అన్న డ్యాన్స్ చేస్తారు, సీరియస్ నటన చేస్తారు, కామెడీతో నవ్విస్తారు… ఒక ఆల్రౌండర్ అని నేను గర్వంగా చెప్పగలను. కానీ ఆయన తాను చూస్తే జ్యోతిష్యులు, పండితుల మాటలను బాగా నమ్మేవారు. వారి సూచనలతో మంచి సినిమాలను వదులుకున్నారు. కెరీర్ చక్కగా ఉండగానే, అపవాదాలను నమ్మి వక్రదృష్టిని దూరం పెట్టే చుట్టుపక్కల వారి మాటలను ఎక్కువగా నమ్మారు. అదే ఆయన జీవితాన్ని మళ్లించేసింది.” అంటూ నిహలానీ ఉంది.

అంతేకాదు, గోవిందా సింగిల్ స్క్రీన్ స్టారుగా వెలిగారు . మల్టీప్లెక్స్ యుగం రాగానే ఆయన సినిమాలు అసలు రిలీజే కాలేదని గుర్తు చేసారు.

“పార్ట్‌నర్ తర్వాత గోవిందా సినిమాలు సడన్‌గా ఆగిపోయాయి. ఆ టైంలో డేవిడ్ ధావన్‌తో పని చేయడం వల్ల కొంత మార్పు వచ్చింది కానీ… సినిమాల పట్ల ఆయన దృష్టిని డేవిడ్ పూర్తిగా మార్చేశాడు.” అని నిహలానీ అన్నారు.

గోవిందా భార్య సునీత స్పందన

గోవింద భార్య సునీత కూడా ఇదే విషయాన్ని మరో కోణంలో స్పష్టం చేశారు.

“నా భర్త చాలా నమ్మకం కలిగినవాడు. ఆయన్ని ఎవరైనా చుట్టేశారంటే… ఆయన గుండె కదలిపోతుంది. అలా చుట్టూ ఉన్నవాళ్లు సూచించిన దారిలో నడవడం వల్లే ఆయన్ను. మంచి అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది.” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గోవిందా సినీ ప్రయాణం – ఓ ఫ్లాష్‌బ్యాక్

1963 లో జన్మించిన గోవింద, తొలి ప్రయత్నంగా మహాభారతంలో అభిమన్యుడి పాత్రకు ఆడిషన్ ఇచ్చారు.

ఆ తర్వాత ఖుష్బూ సరసన ‘తాన్ బదన్’తో ఎంట్రీ ఇచ్చి తొలి హిట్ కొట్టారు.

90లలో వరుస విజయాలతో బాలీవుడ్‌ను శాసించారు.

1991లో ‘హమ్’ చిత్రంలో అమితాబ్, రజనీ సరసన నటించి స్టార్ స్థాయిని పెంచుకున్నారు.

2010లో మణిరత్నం ‘రావణన్’ ద్వారా తెలుగులోనూ కనిపించారు.

,
You may also like
Latest Posts from