సినిమా వార్తలు

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్? రామ్ సర్ప్రైజ్ ప్లాన్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కొత్త సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ హంగామా మొదలైంది! టీజర్‌, పాటలతోనే యూత్‌లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం… ఇప్పుడు గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అవబోతుంది.

నవంబర్ 27న గోవా ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రీమియర్ షో కన్‌ఫర్మ్ అయ్యింది. అదే రోజున తెలుగు రాష్ట్రాల్లో పేడ్ ప్రీమియర్స్ గురించి కూడా టాక్ మొదలైంది. ఆ తర్వాతి రోజు—నవంబర్ 28న వరల్డ్‌వైడ్ రిలీజ్!

USలో కూడా రామ్ హంగామా రెడీ!

అమెరికా ప్రేక్షకుల కోసం నవంబర్ 26న ప్రత్యేక ఎర్లీ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. అక్కడ రామ్, హీరోయిన్ భగ్యశ్రీ బోర్స్ ఇద్దరూ ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూడబోతున్నారట!

సినిమా కథ – ఫ్యాన్స్ కలగా, ఫిల్మ్ ఫీవర్‌గా!

సుమారు 160 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో రామ్ పాత్ర పేరు సాగర్ – సినిమా హీరో సూర్య కుమార్ కు డైహార్డ్ ఫ్యాన్‌గా ఉండే యువకుడు. అతని ఫ్యాన్‌డమ్, లవ్ లైఫ్, అవమానం, గౌరవం, ఆరాధన అన్నీ కలసి అతన్ని జీవితానికి కొత్త అర్ధం చూపిస్తాయి. ఒక ఐడల్‌ను ఆరాధించడం… జీవితాన్ని మార్చే ప్రయాణంగా మారితే? అదే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఎమోషన్!

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
దర్శకుడు: మహేష్ బాబు P
నటీనటులు: రామ్ పోతినేని, భగ్యశ్రీ బోర్స్, ఉపేంద్ర ముఖ్యపాత్రలో

Similar Posts