మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సినిమాకు సంబంధించిన విడుదల తేదీ విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్న తేదీలు ఎన్నో మారిపోయాయి. దాంతో — ‘‘విశ్వంభర ఎప్పుడు వస్తుంది?’’ అనే ప్రశ్ననే మెగా అభిమానులుకు పర్మనెంట్ క్వచ్చిన్ గా మారింది.

ఇక ఇదంతా ఎందుకు జరుగుతోంది?

మొదటగా, టీజర్‌కు స్పందన ఆశించిన స్థాయిలో రాలేదు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ పట్ల విమర్శలు రావడంతో టీమ్ వీఎఫ్ఎక్స్ పనులను తిరిగి చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు, నాన్-థియేట్రికల్ డీల్స్ (ఓటిటి, సాటిలైట్ హక్కులు) కూడా పెద్ద మొత్తానికి వెళ్లటం లేదు. దాంతో నిర్మాతలు ఇప్పటికీ మంచి డీల్‌ కోసం వేచి చూస్తున్నారు. అయితే అన్ని డీల్స్ క్లోజ్ అయ్యే ముందు వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

ఇక అసలు సమస్య ఏంటంటే — మంచి హాలిడే వీకెండ్ డేట్లు అన్నీ ఇప్పటికే ఇతర సినిమాలు బుక్ చేసుకుంటుండటంతో విశ్వంభరకి బజ్‌ తగ్గిపోతోందనే టెన్షన్ పెరుగుతోంది.

ఒకపుడు దసరా విడుదల అనే ప్రచారం జరిగింది. కానీ పవన్ కల్యాణ్ నటిస్తున్న OG దసరాకే విడుదల కానున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో, విశ్వంభర దసరా ఫిక్స్ కాదని తేలిపోయింది.

ఇక డిసెంబర్లో ఇప్పటికే రాజా సాబ్ వంటి సినిమాలు వరుసగా రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇదంతా చూసి, ‘‘విశ్వంభర ఇంకెప్పుడు వస్తుంది?’’ అనే ప్రశ్న మళ్ళీ బయటపడుతోంది.

ఇదిలా ఉండగా, చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి (2026) రిలీజ్ లక్ష్యంగా రూపొందుతోంది.

ఈ పరిణామాల మధ్య అభిమానుల్లో పెద్ద గందరగోళం నెలకొంది. విశ్వంభర ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ప్రమోషన్స్ మొదలవుతాయి? రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? అన్న ప్రశ్నలతో సోషల్ మీడియా నిండిపోతోంది.

ఈ నేపథ్యంలో, దర్శకుడు వశిష్ఠ, నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ — బాక్సాఫీస్‌ పై మెగా ఇంపాక్ట్ చూపించాలంటే — వెంటనే వీఎఫ్ఎక్స్ పనులను పూర్తి చేసి, ఒక స్పష్టమైన రిలీజ్ డేట్ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విశ్వంభరపై అభిమానుల్లో ఉండే అంచనాలు మాటల్లో చెప్పలేనివి. ఇక ఆ అంచనాల్ని నిజం చేయాలంటే, ఆలస్యం లేకుండా అఫీషియల్ అప్‌డేట్ రావాల్సిందే!

, , , ,
You may also like
Latest Posts from