సినిమా వార్తలు

రెండు జడల రక్తపాతం! నాని మామూలోడు కాదు.. ఆ డేట్ ఫిక్స్ వెనుక మాస్టర్ ప్లాన్!

న్యాచురల్ స్టార్ నాని (Nani) ఫ్యాన్స్‌కు ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ‘ప్యారడైజ్’ విడుదల తేదీపై జరుగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. ముందుగా మార్చి 26న రావాలని ప్లాన్ చేసినప్పటికీ.. ఇప్పుడు ఆ తేదీని మార్చి ఏకంగా ఆగస్ట్ నెలకు షిఫ్ట్ చేశారు. ఈ నిర్ణయం వెనుక నాని అండ్ టీమ్ వేసిన అతి పెద్ద ఎత్తుగడ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు!

ఆగస్ట్ 21.. రెండు జడల రక్తపాతం!

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా వాయిదా పడటంతో నాని సమ్మర్‌లో వస్తాడని అందరూ ఊహించారు. కానీ, నాని మాత్రం సైలెంట్‌గా ఆగస్ట్ 21ని లాక్ చేశాడు. ఈ తేదీని ఎంచుకోవడం వెనుక చాలా లెక్కలు ఉన్నాయి. ఆగస్ట్ రెండో వారంలో సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’, సన్నీ డియోల్ ‘లాహోర్ 1947’ వంటి భారీ బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. వాటితో పోటీ పడటం రిస్క్ అని భావించిన నాని, ఒక వారం గ్యాప్ ఇచ్చి సోలోగా బాక్సాఫీస్‌పై దాడి చేయాలని ఫిక్స్ అయ్యాడు.

అనిరుధ్ కోసం.. అవుట్ పుట్ కోసం!

ఈ వాయిదాకు మరో ప్రధాన కారణం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం అనిరుధ్ చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ప్యారడైజ్’ కు ఇంకా పాటలు, రీ-రికార్డింగ్ వర్క్ పెండింగ్‌లో ఉండటంతో.. తొందరపడి క్వాలిటీ తగ్గించుకోవడం కంటే, అతనికి తగినంత సమయం ఇవ్వడమే మంచిదని మేకర్స్ భావించారు. శ్రీకాంత్ ఓదెలకు కూడా పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరికొంత టైమ్ దొరకడం సినిమాకు ప్లస్ కానుంది.

తారాగణం అదిరిపోయింది!

‘దసరా’ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ విలన్లుగా నటిస్తుండటం విశేషం. కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వింత కాంబినేషన్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Similar Posts