సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ ప్రస్తుతం థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా, స్టార్ కాస్ట్‌తోనే కాకుండా హిందీ బెల్ట్‌లో ఆమిర్ ఖాన్ చేసిన కామియో కారణంగా కూడా చర్చలో ఉంది — కానీ అది సరైన రీజన్ కాదు.

హిందీ ప్రేక్షకుల్లో చాలామంది ఆమిర్ కామియోను ఇండియన్ సినిమాల చరిత్రలోనే అత్యంత నిరాశ కలిగించిన సీన్ గా పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో “లోకేష్ ఇది ఎందుకు చేశాడు?”, “ఈ సీన్ ఏం యాడ్ చేసిందీ?” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది దాన్ని జోకర్‌లా ప్రెజెంట్ చేశారని, టైమింగ్ అసలు సెట్ కాలేదని అంటున్నారు.

రజనీ పక్కన ఆమిర్ కనిపించే సీన్‌లో ఎటువంటి థ్రిల్ లేదా సర్ప్రైజ్ ఫీలింగ్ రాలేదని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అతని మేకప్, లుక్, స్టైలింగ్ ఏదీ సరిగ్గా వర్క్ అవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ఇంత పెద్ద కాస్ట్ ఉన్న సినిమాలో ఆమిర్ రోల్‌కు సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమిర్, ఇలాంటి కామియోస్ చేసేముందు రోల్ ఎంపిక, ప్రెజెంటేషన్‌పై మరింత జాగ్రత్త వహించాలని అభిమానులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆమిర్, లోకేష్ కనగరాజ్‌తో కలిసి భారీ యాక్షన్ సీన్స్‌తో కూడిన సూపర్ హీరో సినిమా చేస్తున్నారు. అయితే, ‘కూలీ’ కామియోపై వచ్చిన ఈ నెగటివ్ రియాక్షన్ తర్వాత, ఆ ప్రాజెక్ట్‌పై కూడా అభిమానుల్లో కంగారు పెరిగింది. రాబోయే సినిమాలో లోకేష్, ఆమిర్‌ను గొప్పగా చూపిస్తాడా? లేక మరోసారి నిరాశ కలిగిస్తాడా? అన్నది చూడాలి.

, , , , , , ,
You may also like
Latest Posts from