అల్లు అర్జున్ తో క‌లిసి పుష్ప‌2 తో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న సుకుమార్, ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు రంగం సిద్దం చేస్తున్నారు. పుష్ప‌2తో సుకుమార్ రేంజ్ ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్ లోకి వెళ్లటంలో తను చేసే చిత్రం కథ కూడా ఆ స్దాయిలో ఉండాలనుకుంటున్నారు. ఇక పుష్ప2 త‌ర్వాత సుకుమార్ త‌న త‌ర్వాతి సినిమాను గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో చేయ‌నున్నాడ‌నే విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా గురించి ఎన్నో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు నెలకొనగా ఇపుడు ఈ సినిమాపై సాలిడ్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ చిత్రంని సుకుమార్ పక్కా యాక్షన్ ప్యాకెడ్ జానర్లో తెరకెక్కించనున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

అలాగే రామ్ చ‌ర‌ణ్ తో సుకుమార్ చేయ‌బోయే పాన్ ఇండియా మూవీ కోసం హీరోయిన్ గా పుష్ప హీరోయిన్ అయిన ర‌ష్మిక మంద‌న్నాని తీసుకోబోతున్నాడ‌ట‌.ఇక ఎప్పటిలాగే ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ నే సంగీతం అందించనుండగా. రంగస్థలం నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మాణం వహించనున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో ఓ భారీ సినిమా చేస్తు్నారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ 16వ సినిమా.

, ,
You may also like
Latest Posts from