ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో రూపొందిన వార్ 2 నేడు థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. కథలో కొత్తదనం అంతగా లేకపోయినా, హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించిన హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా మారాయని ప్రేక్షకులు అంటున్నారు. మూడు రోజుల వరుస సెలవులు రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్ల పరంగా సునామీలా దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

యశ్ రాజ్ ఫిలిమ్స్ (YRF) స్పై సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతోంది. ఈ యూనివర్స్‌లో ఇప్పటివరకు టైగర్ (సల్మాన్ ఖాన్), పఠాన్ (షారుక్ ఖాన్), కబీర్ (హృతిక్ రోషన్) సోలో సినిమాలు, గెస్ట్ అప్పియరెన్సులతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2లో మల్టీస్టారర్‌గా రాగా… వచ్చే రోజుల్లో ఆయనకు సోలో స్పై మూవీ ఖాయమనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

సినిమాలో ఎన్టీఆర్ “రాఘవ” అనే కోడ్ నేమ్‌తో, ఏజెంట్ విక్రమ్‌గా మెరిపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన చెప్పిన డైలాగ్ —

“దేశం కోసం ఒక టైగర్ వచ్చాడు… ఒక పఠాన్ వచ్చాడు… ఒక కబీర్ వచ్చాడు… రేపు ఓ రాఘవ కూడా రాగలడు”

ఈ లైన్‌తో అభిమానుల్లో ఎక్సయిట్‌మెంట్ పీక్స్‌కి చేరింది. ఎన్టీఆర్ పాత్రకు ఇచ్చిన ప్రాముఖ్యతను బట్టి చూస్తే, “విక్రమ్” లేదా “రాఘవ” అనే టైటిల్‌తో ఆయన సోలో స్పై మూవీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ డిస్కషన్ హాట్ టాపిక్‌గా మారింది.

, , , ,
You may also like
Latest Posts from