సినిమా వార్తలు

బెల్జియంలో బన్నీ రేంజ్.. మూసేసిన రెస్టారెంట్ తెరిపించి మరీ పార్టీ! ఒక్క రాత్రికే అంత బిల్లు కట్టారా?

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ రేంజ్ ఎలా ఉందో చెప్పడానికి తాజాగా ఒక షాకింగ్ ఉదాహరణ బయటకు వచ్చింది. విదేశాల్లో ఒక రెస్టారెంట్ మూసేసినా, కేవలం అల్లు అర్జున్ కోసం దాన్ని మళ్ళీ ఓపెన్ చేశారంటే ఆయన పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు!

అసలేం జరిగిందంటే?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలకు అత్యంత విలాసవంతమైన సేవలను అందించే ‘లగ్జరీ కాన్సియర్జ్’ సంస్థ సీఈవో కరణ్ భంగే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బన్నీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అల్లు అర్జున్ తన స్నేహితులతో కలిసి బెల్జియం పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఒక్క పూట విందు.. వారపు కలెక్షన్!

అల్లు అర్జున్ తన బృందంతో కలిసి బెల్జియంలోని ఒక ఫేమస్ రెస్టారెంట్‌లో బర్త్ డే వేడుకను ప్లాన్ చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు అది సీజన్ కాకపోవడంతో ఆ రెస్టారెంట్‌ను మూసివేశారు. కానీ, అక్కడ ఉన్నది ఐకాన్ స్టార్ అని తెలియడంతో ఆ రెస్టారెంట్ యజమాన్యం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

స్పెషల్ ఓపెనింగ్: బన్నీ కోసం మూసి ఉన్న రెస్టారెంట్‌ను ఆ ఒక్క సాయంత్రం కోసం ప్రత్యేకంగా తెరిచారు.
భారీ ఖర్చు:ఆ రెస్టారెంట్ ఒక వారం రోజుల్లో సంపాదించే మొత్తం ఆదాయాన్ని, అల్లు అర్జున్ బృందం కేవలం ఆ ఒక్క పూట ఏర్పాట్ల కోసమే చెల్లించారట.
ఇండియన్ టచ్:కేవలం రెస్టారెంట్ తెరవడమే కాదు, బన్నీ అభిరుచికి తగ్గట్టుగా స్పెషల్ ఇండియన్ వంటకాలు, బ్యాక్ గ్రౌండ్‌లో మన మ్యూజిక్ కూడా ఏర్పాటు చేయడం విశేషం.

హాలీవుడ్ స్టార్స్ కంటే మిన్నగా..

“మేము ఇప్పటివరకు ఎంతోమంది హాలీవుడ్, బాలీవుడ్ స్టార్ల కోసం పనిచేసాం. కానీ అల్లు అర్జున్ టీమ్ కోసం చేసిన ఈ ఏర్పాట్లు మాకు మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చాయి” అని కరణ్ భంగే కొనియాడారు. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదని, అంతర్జాతీయ స్థాయి లగ్జరీ సర్వీసెస్‌ను కూడా శాసించే స్థాయికి చేరిందని స్పష్టమవుతోంది.

Similar Posts