సినిమా గ్లామర్ ప్రపంచం వెనుక ఎన్ని చీకటి కోణాలు ఉంటాయో మరోసారి బయటపడింది. తాజాగా మలయాళ నటిసనా అల్తాఫ్ (Sana Althaf) తనకు ఎదురైన ఒక దారుణమైన సంఘటనను బయటపెట్టి ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అవకాశాల కోసం కొందరు నీచమైన పనులకు ఎలా ఒడిగడతారో ఆమె వివరించిన తీరు వింటే ఎవరికైనా ఒళ్లు మండుతుంది.

ఆ ఒక్క కాల్‌తో కథ మొదలైంది!

సనా అల్తాఫ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకసారి తనకు ఒక వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని, అతను తనను ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం సంప్రదించాడని తెలిపింది. సినిమా ఆఫర్ అని సంతోషపడేలోపే అతగాడు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు.

“సర్దుకుపోతేనే ఛాన్స్!”

ఆ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ..”సినిమాలో ఛాన్స్ రావాలంటే కాస్త ‘అడ్జస్ట్’ అవ్వాలి. నీకు ఓకే అయితేనే ముందుకు వెళ్దాం” అని పచ్చిగా మాట్లాడాడట. ఆ మాట వినగానే సనా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అసలు అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి అని ఆమె అడిగితే..”డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ అడిగినప్పుడు వారి కోరిక తీర్చాలి (Casting Couch)” అని అతను నిర్మొహమాటంగా చెప్పాడట.

సనా ఇచ్చిన అదిరిపోయే కౌంటర్!

ఈ నీచమైన ప్రపోజల్‌తో సనా అల్తాఫ్ అస్సలు తగ్గలేదు. తనను అలా పిలిచిన వాడికి చుక్కలు చూపించింది.”నీకు అసలు సిగ్గుందా? ఇలాంటి పనులు చేసేందుకేనా నువ్వు ఈ ఫీల్డ్ లో ఉన్నావు?” అంటూ చీదరించుకుంది. అవకాశాల కోసం తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనని తేల్చి చెప్పింది.

ఇండస్ట్రీలో ప్రకంపనలు!

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సనా లాంటి ధైర్యవంతులు బయటకు వచ్చి ఇలాంటి విషయాలు చెబితేనే, కాస్టింగ్ కౌచ్ అనే భూతం అంతమవుతుందని నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని వచ్చే యువతులకు ఇలాంటి “బ్రోకర్లు” ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

మరిన్ని సినీ అప్డేట్స్ మరియు ఇండస్ట్రీ గాసిప్స్ కోసం మా వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి!

#Actress Sana Althaf, #casting couch, #Sana Althaf, #Social Media

By admin