
ఒక్క సంతకంతో రూ. 300 కోట్లు? అల్లు అర్జున్ భారీ డీల్ వెనుక కథ ఇదే!
Allu Arjun: అల్లు అర్జున్ నయా రికార్డ్.. ఒక్క సినిమాకు ₹270 కోట్లా? ఇండియన్ సినిమాలో బన్నీ సృష్టించిన వింత ట్రెండ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు.. బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టే ఒక గ్లోబల్ బ్రాండ్. ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2) తో పాన్-ఇండియా రేంజ్‌లో రికార్డులను తిరగరాసిన బన్నీ, ఇప్పుడు పారితోషికం విషయంలోనూ ఇండియన్ సినీ పరిశ్రమలో ఎవరూ ఊహించని సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.
రెమ్యునరేషన్ వద్దు.. బిజినెస్ పర్సంటేజ్ ముద్దు!
సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమాకు ఇంత అని ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ‘పర్సంటేజ్ మోడల్’ (Percentage Model) వైపు అడుగులు వేస్తున్నారు. ‘పుష్ప 2’ నుంచే ఆయన ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. సినిమా జరిగిన మొత్తం బిజినెస్‌లో (థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులు కలిపి) ఏకంగా 27 శాతం పారితోషికంగా తీసుకుంటున్నారు.
పుష్ప 2 లెక్కలు ఇవే.. రూ. 270 కోట్లు జేబులోకి!
‘పుష్ప 2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ లెక్కన 27 శాతం వాటా అంటే అల్లు అర్జున్ ఒక్క సినిమాకే దాదాపు రూ. 270 కోట్లు ఆదాయం పొందినట్లు సమాచారం. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక నటుడు అందుకున్న అత్యధిక పారితోషికాలలో ఒకటిగా నిలిచిపోయింది.
అట్లీ (Atlee) సినిమాకు అంతకంటే ఎక్కువే?
దర్శకుడు అట్లీతో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న తదుపరి భారీ ప్రాజెక్ట్ (AA22/AA23) కోసం కూడా బన్నీ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఈ సినిమాకు 27 నుంచి 30 శాతం వరకు బిజినెస్ షేర్ తీసుకోవడానికి సన్ పిక్చర్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్. ఈ డీల్ మొత్తం అత్యంత పారదర్శకంగా ఉంటుందని, అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాసు ఈ వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది.
