సినిమా వార్తలు

బాలయ్య కీ తప్పని బడ్జెట్ కోత..ప్చ్, పరిస్దితులు మారిపోయాయి !

టాలీవుడ్ సెన్సేషన్, బాక్సాఫీస్ బోనన్జా నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే భారీ సెట్లు, వందల కోట్ల బడ్జెట్, కళ్ళు చెదిరే విజువల్స్ గుర్తొస్తాయి. గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ లాంటి మాస్ హిట్ తర్వాత వస్తున్న NBK111 పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, ఇప్పుడు వినిపిస్తున్న ఒక షాకింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య సినిమాకు ఊహించని విధంగా బడ్జెట్ కోత పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అంచనాలు రివర్స్.. రిస్క్ జోన్ లోకి రాయల్ డ్రామా!

మొదట ఈ సినిమాను ఒక హై-వోల్టేజ్ పీరియడ్ డ్రామాగా, అత్యంత భారీ వ్యయంతో ప్లాన్ చేశారు. అయితే, ‘అఖండ 2’ బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ మేకర్స్ కళ్లు తెరిపించింది. మార్కెట్ పరిస్థితులు, రీసెంట్ డిజాస్టర్ల ఎఫెక్ట్‌తో మేకర్స్ ఇప్పుడు రూట్ మార్చక తప్పలేదు. పాత కథను పక్కన పడేసి, బడ్జెట్‌ను అదుపులో ఉంచుకుంటూ గోపీచంద్ కొత్త వెర్షన్‌ను సిద్ధం చేశారు. అంటే, గతంలో ప్లాన్ చేసిన రాజసం ఈ సినిమాలో ఉండబోదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్మాతల సేఫ్ గేమ్.. బాలయ్య మార్కెట్ కు దెబ్బేనా?

ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు ఇప్పుడు లెక్కల వేటలో పడ్డారు. భారీ బడ్జెట్‌తో రిస్క్ చేసేకంటే, కంట్రోల్డ్ బడ్జెట్‌తో సేఫ్ జోన్‌లోకి వెళ్లడమే ఉత్తమమని ఫిక్స్ అయ్యారు. మార్చి 5 నుంచి సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాను వీలైనంత తక్కువ ఖర్చుతో ముగించాలని డిసైడ్ అయ్యారు. బాలయ్య లాంటి మాస్ హీరో సినిమాకు ఇలా బడ్జెట్ కోత విధించడం అంటే, అది ఇండస్ట్రీ మారుతున్న తీరుకు నిదర్శనం.

బడ్జెట్ తగ్గినా బాలయ్య మార్క్ మేనరిజమ్స్, గోపీచంద్ మార్క్ యాక్షన్ ఉంటే సినిమా హిట్టే అనడంలో సందేహం లేదు. కానీ, భారీతనం ఆశించే ఫ్యాన్స్‌ను ఈ లో-బడ్జెట్ స్ట్రాటజీ ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. పరిస్థితులు మారాయి కాబట్టి బాలయ్య కూడా ఈ బడ్జెట్ కోతకు తలొగ్గక తప్పలేదు. మరి ఈ ‘రీమాస్టర్డ్’ వెర్షన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి!

Similar Posts