సినిమా గాసిప్స్సినిమా వార్తలు

ఇజ్రాయెల్ యుద్ధంలో హాలీవుడ్ లెజెండ్ క్వెంటిన్ టరాన్టినో ఖతం? క్షిపణి దాడిలో ఫ్యామిలీతో సహా బూడిదయ్యారా? అసలు నిజం ఇదీ!

ప్రపంచ సినిమా గమనాన్ని మార్చిన మాస్టర్ మైండ్, ‘కిల్ బిల్’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల సృష్టికర్త క్వెంటిన్ టరాన్టినో గురించి వస్తున్న ఒక వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో టరాన్టినో తన కుటుంబంతో సహా క్షిపణి దాడికి బలయ్యారనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులను వణికిస్తోంది. అసలు యుద్ధ భూమిలో ఏం జరిగింది? ఆ క్షిపణి నేరుగా టరాన్టినో ఇంటిపైనే పడిందా? ఈ వార్తల్లో నిజమెంత?

బాంబ్ షెల్టర్ ఫోటోలు.. నెట్టింట వైరల్ అవుతున్న మరణవార్త!

టరాన్టినో ఇజ్రాయెల్ దేశంలోనే ఎక్కువగా నివసిస్తుంటారు. ఇరాన్ క్షిపణి దాడుల్లో టరాన్టినో తన భార్యాపిల్లలతో సహా చనిపోయారని, ఒక ప్రముఖ వెబ్ సైట్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసిందని ఎక్స్ (ట్విట్టర్) లో వార్తలు వెల్లువెత్తాయి. దీనికి తోడు టరాన్టినో బాంబ్ షెల్టర్ లో భయపడుతూ కూర్చున్న కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో అభిమానుల గుండె ఆగినంత పనైంది. లక్షలాది మంది ఈ పోస్టులను షేర్ చేయడంతో నిమిషాల్లో ఈ వార్త వరల్డ్ వైడ్ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది.

అసలు నిజం ఏంటంటే.. ఇదంతా ఒక పెద్ద స్కామ్!

అయితే, ఈ వార్తలపై ఆరా తీయగా ఒక షాకింగ్ నిజం బయటపడింది. టరాన్టినో చనిపోయారని చెబుతున్న ఏ వెబ్ సైట్ కూడా అలాంటి వార్తను ప్రచురించలేదు. టరాన్టినో సన్నిహితులు దీనిపై స్పందిస్తూ, ఆయన తన కుటుంబంతో సురక్షితంగా ఉన్నారని, ప్రస్తుతం ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. ఇక వైరల్ అవుతున్న ఫోటోలు కూడా ఏఐ (AI) తో సృష్టించినవి లేదా డిజిటల్ గా ఎడిట్ చేసినవని తేలిపోయింది. యుద్ధ సమయంలో ఇలాంటి ఫేక్ వార్తలను సృష్టించి వ్యూస్ కోసం కక్కుర్తి పడ్డారని అర్థమవుతోంది.

టరాన్టినో మరణవార్త కేవలం ఒక వెకిలి చేష్ట మాత్రమే. ఆయన క్షేమంగానే ఉన్నారు, త్వరలోనే తన తదుపరి ప్రాజెక్టులతో మన ముందుకు రాబోతున్నారు. యుద్ధం పేరుతో ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్న వారిపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియాలో ఏదైనా వార్త చూడగానే నమ్మేయకుండా, నిజానిజాలు తెలుసుకోవడం చాలా అవసరమని ఈ ఘటన మరోసారి నిరూపించింది!

Similar Posts