స్టార్ హీరోల లైఫ్ అంటే కేవలం లగ్జరీ కార్లు, కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే అనుకుంటే పొరపాటే. వాళ్ల సక్సెస్ వెనుక గుండెల్ని పిండేసే అవమానాలు, కన్నీళ్లు ఉంటాయి. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఒకప్పుడు అన్నం తింటున్న రవితేజను డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి కుక్కను గెంటేసినట్టు గెంటేసిన ఆ నిర్మాత ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
టాలీవుడ్‌లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సున్నా నుంచి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న హీరో రవితేజ. నేడు ఆయన డేట్ల కోసం నిర్మాతలు క్యూ కడతారు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లో ఆయన అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. తాజాగా స్టార్ రైటర్ కోన వెంకట్ ఒక ఇంటర్వ్యూలో రవితేజ ఎదుర్కొన్న అత్యంత నీచమైన అవమానం గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. ఆ రోజు రవితేజ కళ్లలో వచ్చిన నీళ్లు, ఆ తర్వాత ఆయన సాధించిన విజయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డైనింగ్ టేబుల్ దగ్గర ఘోర అవమానం
రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఒక ప్రొడక్షన్ ఆఫీస్‌కు వెళ్లారు. మధ్యాహ్నం ఆకలి వేస్తుంటే, అక్కడి ఆఫీస్ బాయ్ రమ్మని పిలిస్తే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం మొదలుపెట్టారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ బడా నిర్మాత రవితేజను చూసి చిందులు తొక్కాడు. “అడ్డమైన వాళ్లందరినీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మేపుతున్నారా?” అంటూ స్టాఫ్ మీద అరిచి, రవితేజను దారుణంగా అవమానించాడు. చేతిలో ఉన్న అన్నం ముద్దను నోటిలోకి తీసుకోలేక, పారేయలేక రవితేజ అనుభవించిన ఆ వేదన వర్ణనాతీతం.
కాలం చెప్పిన సమాధానం:
కట్ చేస్తే.. రవితేజ మాస్ మహారాజాగా అవతరించారు. విచిత్రం ఏమిటంటే, ఆ రోజు భోజనం దగ్గర అవమానించిన అదే నిర్మాత, ఇప్పుడు రవితేజ కాల్ షీట్ల కోసం ఆయన ఆఫీస్ బయట గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ నిర్మాతను చూసిన కోన వెంకట్, “అతను నిన్ను అంతలా అవమానించాడు కదా, అసలు డేట్లు ఇవ్వకు” అని రవితేజతో చెప్పారు.
రవితేజ మాస్ రివెంజ్:
కానీ ఇక్కడే రవితేజ తన అసలైన రేంజ్ ఏంటో చూపించారు. “అతనికి డేట్లు ఇవ్వకుండా పంపించడం కాదు, అతని బ్యానర్‌లోనే సినిమా చేసి హిట్ కొట్టడమే నా అసలైన విజయం” అని సమాధానం ఇచ్చారు. తనను అవమానించిన వాళ్ల మీద పగ పెంచుకోకుండా, తన ఎదుగుదలతోనే వాళ్ల నోళ్లు మూయించిన రవితేజ రియల్ మాస్ హీరో అనిపించుకున్నారు.
నేడు రవితేజ కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుండొచ్చు, కానీ ఆ రోజు పడిన కన్నీటి చుక్కే నేడు ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. ఎవరినైనా తక్కువ అంచనా వేసి అవమానిస్తే, కాలం ఎలా బుద్ధి చెబుతుందో రవితేజ లైఫ్ ఒక బెస్ట్ ఎగ్జామ్పుల్. మాస్ మహారాజా సక్సెస్ జర్నీ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది!

