బూతు హద్దులు దాటిన ‘కేడీ: ది డెవిల్’ సాంగ్.. సంజయ్ దత్, నోరా ఫతేహి అశ్లీల చిందులపై దేశవ్యాప్తంగా ఆగ్రహం! అర్మాన్ మాలిక్ షాకింగ్ ట్వీట్.. అసలు ఏం జరుగుతోంది?

వివరాల్లోకి వెళితే..
ధ్రువ సర్జా హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కేడీ: ది డెవిల్’ ఇప్పుడు ఒక వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఈ సినిమాలో నోరా ఫతేహి, సంజయ్ దత్ కాంబినేషన్‌లో వచ్చిన “సర్కే చునర్ తేరి సర్కే” అనే సాంగ్ లోని సాహిత్యం, కొరియోగ్రఫీ తీవ్ర దుమారం రేపుతున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నిండిపోయిన ఈ పాటపై నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు.
Bollywood is a vile hypocrisy pit – no family values or culture, only vulgarity!
"Bhaag DK Bose," "Choli ke pichhe kya h", "Chikni Chameli", "Shila ki Jawani" r just few examples.
Atleast South Indian movies show family values & culture.#NoraFatehi
pic.twitter.com/GF9alVRxqB— Kana (@Kanatunga) March 17, 2026
బాలీవుడ్ కి సిగ్గు లేదు: కంగనా సెన్సేషనల్ కామెంట్స్!
“బాలీవుడ్ అశ్లీలత, చీప్ ట్రిక్స్ తో అన్ని హద్దులను దాటేసింది. దేశం మొత్తం ఛీ కొడుతున్నా వీళ్లలో మార్పు రావడం లేదు. అటెన్షన్ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు” అంటూ కంగనా నిప్పులు చెరిగారు. సెన్సార్ బోర్డు ఇలాంటి పాటలకు ఎలా పర్మిషన్ ఇస్తుందో అర్థం కావడం లేదని, ఇలాంటి అశ్లీలతను ఆపడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

వినడానికే అసహ్యంగా ఉంది: సింగర్ అర్మాన్ మాలిక్ ఆవేదన!
కంగనా కంటే ముందే ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ ఈ పాటపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. “పాట విన్నాక నాకు నేనే నమ్మలేకపోయాను, మళ్లీ వీడియో చూసి షాక్ అయ్యాను. కమర్షియల్ సాంగ్స్ క్వాలిటీ ఇంత దారుణంగా పడిపోతుందా? ఇంత దిగజారుతారా?” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం ఈ పాటపై ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ లో క్రిమినల్ కేసు కూడా నమోదైంది. మైనర్ల మీద ఈ పాట ప్రభావం దారుణంగా ఉంటుందని, వెంటనే దీన్ని యూట్యూబ్ నుంచి తొలగించాలని లాయర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ కన్నడ చిత్రం తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. అయితే ప్రమోషన్స్ కోసం ఇలా బూతును వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

