ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతున్నా ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేదు.. కోట్లు ఖర్చు పెట్టి భారీ సినిమాలు తీసినా అదృష్టం తలుపు తట్టడం లేదు! అక్కినేని వారసుడిగా భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కెరీర్ ఇప్పుడు ‘డూ ఆర్ డై’ పొజిషన్‌లో ఉంది. ఈ క్రమంలో నమ్ముకున్న ‘లెనిన్’ సినిమాపై వస్తున్న వార్తలు ఇప్పుడు ఫ్యాన్స్‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా, అక్కినేని ఫ్యామిలీ ప్రిన్స్‌గా అఖిల్ అక్కినేనిపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అన్న నాగచైతన్య అడపాదడపా హిట్లు కొడుతూ కెరీర్‌ను లాక్కొస్తున్నా, అఖిల్ మాత్రం ఒక్క భారీ సక్సెస్ కోసం పదేళ్లుగా అల్లాడిపోతున్నాడు. ‘ఏజెంట్’ వంటి డిజాస్టర్ తర్వాత తన ఆశలన్నీ ‘లెనిన్’ అనే మాస్ యాక్షన్ డ్రామాపైనే పెట్టుకున్నాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అవుట్‌పుట్ విషయంలో కింగ్ నాగార్జున తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయని ఇండస్ట్రీ టాక్.

నాగార్జున ఎంటర్.. డైరెక్టర్‌కు క్లాస్?
అఖిల్ కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు నాగార్జున స్వయంగా రంగంలోకి దిగారు. ‘లెనిన్’ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌ను చూసిన నాగ్, కొన్ని కీలక సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవని దర్శకుడికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, స్క్రీన్ ప్లే విషయంలో మార్పులు చేర్పులు చేయాలని గట్టిగా ఆదేశించారట. నాగార్జున సూచనల మేరకు ఇప్పుడు డైరెక్టర్ స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారని, అందుకే సినిమా లేట్ అవుతోందని సమాచారం. ఒకవేళ నాగ్ చెప్పినట్టుగా మార్పులు జరగకపోతే ప్రాజెక్ట్ రిస్క్‌లో పడే అవకాశం ఉంది.

హిట్ కొట్టకపోతే ఫేడవుట్ తప్పదా?
అఖిల్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అక్కినేని ఫ్యాన్స్ సైతం అఖిల్ కెరీర్ గ్రాఫ్ చూసి నిరుత్సాహపడుతున్నారు. వరుస ఫ్లాపులతో ఉన్న అఖిల్‌కు ‘లెనిన్’ చివరి ఆశ అని చెప్పాలి. ఈ సినిమాతోనైనా మాస్ ఇమేజ్ తెచ్చుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కకపోతే, ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడం అఖిల్‌కు దాదాపు అసాధ్యమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తండ్రి నాగార్జున అండతో ఈ ప్రాజెక్టును ఎలాగైనా గట్టెక్కించాలని అఖిల్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
మరోవైపు నాగచైతన్య ‘వృషకర్మ’ సినిమాతో బిజీగా ఉంటూ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొడతాననే ధీమాతో ఉన్నాడు. కానీ అఖిల్ మాత్రం ‘లెనిన్’ చిక్కుముడి ఎప్పుడు వీడుతుందా అని ఎదురుచూస్తున్నాడు. నాగార్జున పర్యవేక్షణలో జరుగుతున్న ఈ మార్పులు అఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పుతాయా? ‘లెనిన్’ తో అఖిల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతాడా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా అక్కినేని వారసుడికి ఇది అగ్నిపరీక్షే!

