ఒకప్పుడు రీజనల్ ఫిల్మ్ కు దూరంగా ఉన్న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఇప్పుడు వరుస సినిమాలు సైన్ చేసింది. గతేడాది బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అనేక చిత్రాల స్ట్రీమింగ్‌ రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌ 2025లోనూ అదే ఒరవడి కొనసాగిస్తోంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న (upcoming telugu movies ott) అనేక క్రేజీ ప్రాజెక్ట్‌ల హక్కులను విడుదల ముందే దక్కించుకుంది. సంక్రాంతి సందర్భంగా ఆ సినిమాలకు సంబంధించిన వివరాలను పంచుకుంది. థియేట్రికల్‌ రన్‌ తర్వాత ఒప్పందం మేరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతాయి.

ఓజీ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.92 కోట్లకి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే పవన్ సినిమాల్లో ఇదే అత్యధికం కావచ్చు. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్‌కి నెట్‌ఫ్లిక్స్ 2025 స్లాట్‌ను కేటాయించింది.

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ నుంచి రానున్న చిత్రాల్లో ‘ఓజి’ కూడా ఒకటి. దర్శకుడు సుజిత్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ పవర్​ ఫుల్​ గ్యాంగ్​స్టర్​ యాక్షన్ మూవీని పాన్‌ ఇండియా చిత్రంగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా, ఇమ్రాన్‌ హష్మీ విలన్ పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. సెప్టెంబరు 2న పవన్‌ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగానే ఈ ఫస్ట్ సాంగ్​ను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ అప్పుడు కుదరలేదు. ఎందుకంటే అప్పటికీ ఏపీలో ఉన్న వరదల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని విడుదల చేయలేదు.

ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో పవన్‌ కల్యాణ్ ఓజాస్‌ గంభీర అనే పవర్​ ఫుల్​ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగానే ఇమ్రాన్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. సినిమాకు తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు కూడా ఓ పాట పాడారు.

చిత్రం: ఓజీ (OG); నటీనటులు: పవన్‌కల్యాణ్‌, ఇమ్రాన్‌ హష్మి, ప్రియాంక మోహన్‌; దర్శకత్వం: సుజీత్‌

, ,
You may also like
Latest Posts from