ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలను తన భర్తతో కలిసి జరుపుకుంటోంది కీర్తి సురేష్. తొలిసారి వేడుకలకు తమిళ హీరో విజయ్ , కళ్యాణి ప్రియదర్శన్, మమిత బైజు కూడా ఈ సంబరాలులో పాల్గొన్నారు. కీర్తి సురేష్ తన ఇనిస్ట్రాలో ఈ వేడుకలకు సంభందించిన ఫొటోలను షేర్ చేసింది. వివాహం తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతిని ఈ జంట ఘనంగా జరుపుకున్నారు.

తాను ప్రేమించిన ఆంథోనీ తటిల్ (Keerthy Suresh Husband)తో నటి కీర్తి సురేశ్ (Keerthy Suresh) ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే.
2024 డిసెంబర్ నెల 12న హిందూ సంప్రదాయ ప్రకారం వారి పెళ్లి (Keerthy Suresh Marriage) చేసుకున్నారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఓ చర్చిలో ఆదివారం మరోసారి వారి వివాహ వేడుక జరిగింది. సంబంధిత ఫొటోలను కీర్తి సురేశ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
కీర్తి సురేశ్ – ఆంథోనీ దాదాపు 15 ఏళ్ల నుంచి స్నేహితులు. ఇదే విషయాన్ని ఇటీవల ఆమె అధికారికంగా చెప్పారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు.

ఆంథోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కీర్తితో ఆయనకు పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది. ‘రఘుతాత’తో ఇటీవల ప్రేక్షకులను అలరించారు కీర్తిసురేశ్..

ప్రస్తుతం ‘రివాల్వర్ రీటా’, ‘బేబీ జాన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్’ (Baby John)తో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెల 25న విడుదల అయ్యింది.