ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం ఇపుడు భారీ వసూళ్లతో వరల్డ్ వైడ్ గా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఒక్క వెంకీ మామ కెరీర్ లోనే కాకుండా మన తెలుగు సంక్రాంతి బరిలో వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ లిస్ట్ లో చేరి దుమ్ము రేపుతోంది. మరి ఈ చిత్రానికి ప్రేరణ ఏమిటి. ఎలా ఐడియా వచ్చిందనే విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి రివీల్ చేసారు.
అనీల్ రావిపూడి మాట్లాడుతూ… ‘అసలు సంక్రాంతికి వస్తున్నాం ఐడియా ఇచ్చిందే మహేశ్‌బాబు. ఆయన రజనీకాంత్ ‘జైలర్’ చూసిన తర్వాత నాకు ఫోన్‌చేసి 45 నిమిషాలు మాట్లాడారు. ‘ఇలాంటి ట్విస్ట్‌తో మీరు ఒక సినిమా చేస్తే వండర్స్ క్రియేట్ చేస్తారు’ అని సలహా ఇచ్చారు.
మహేష్ బాబు సలహాతోనే ఈ కథకు బీజం పడింది. ఇంటర్వెల్ తర్వాత హీరోను పోలీస్ ఆఫీసర్‌గా చూపించమని నా టీమ్ మొత్తం చెప్పింది. అలా బాగుండదని నేను ఒక్కడినే పట్టుపట్టా. ‘మన కథలో హీరోయిజం ఉండకూడదు. చిన్నరాజు పాత్రే మొత్తం కనపడాలి’ అని అన్నాను. నా అంచనా నిజమైంది’’ అని చెప్పుకొచ్చారు.
ఇక ‘‘సంక్రాంతికి వస్తున్నాం’కు సీక్వెల్ కచ్చితంగా ఉంటుంది. రాజమండ్రిలో పూర్తయిన కథ.. అక్కడే మొదలవ్వొచ్చు.
పోలీస్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేసే మీనాక్షి మళ్లీ ఎదురింటిలో దిగడం.. బయట కాపలా కాసే భాగ్యం.. గోడ వెనుక నుంచి మీనాక్షిని చూసే వెంకటేశ్‌గారు.. ఈసారి వెంకటేశ్ గర్ల్‌ఫ్రెండ్ దగ్గరకు వెళ్లకుండా కాపలా కాసే మామగారు.. ఇలా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఏదో ఒక సంక్రాంతికి మాత్రం కచ్చితంగా వస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు మాకు ఆ అవకాశం ఇచ్చారు’’ అన్నారు అనీల్ రావిపూడి.