కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత ఆమె తెలుగులో కొన్ని సినిమాలు చేసింది కానీ ఏదీ చెప్పుకోదగ్గ సినిమా కాలేదు. కొంతకాలానికి ఆ ఆఫర్స్ కూడా ఆగిపోయాయి. బాలీవుడ్ కు వెళ్లి అక్కడా ట్రై చేసింది. అక్కడా వర్కవుట్ కాలేదు. దాంతో సినిమా చాన్స్‌లు తగ్గిన తర్వాత శ్వేతా పలు వెబ్‌ సిరీస్‌లలో నటించింది. ఈ క్రమంలో ఆమె హాట్ ఫొటో షూట్ చేసింది.

జార్ఖండ్ బ్యూటీ ‘శ్వేతా బసు ప్రసాద్'(Shweta Basu Prasad) నటించిన మూవీ ‘ఊప్స్ అబ్ క్యా’ (Oops Ab Kya) ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ప్రస్తుతం హిందీ వర్షన్‌లో మాత్రమే రిలీజ్‌ కానుంది. అయితే, తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.​

ఈ క్రమంలో అడల్ట్‌ రేటెడ్‌ డైలాగ్స్‌తో ఒక టీజర్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేశారు. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ అమ్మాయి అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే పరిస్థితి ఏంటి..? అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ వస్తోంది. తాజాగా విడుదలైన టీజర్‌ చూస్తుంటే కాస్త ఆసక్తిగా, సరికొత్త కథతో మేకర్స్‌ తెరకెక్కించారని తెలుస్తోంది.

పెళ్లికాని ఒక యువతి అనారోగ్యంగా కారణంగా ఆస్పత్రికి వెళ్తే.. డాక్టర్స్‌ చేసిన చిన్న పొరపాటుతో ఆమె ప్రెగ్నెట్‌ అవుతుంది. ఇంతకూ ఆస్పత్రిలో జరిగిన సంఘటన ఏంటి..? అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఊప్స్ అబ్ క్యా చిత్రం రానుంది. అయితే, ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=DI_nt5ZitgE

, ,
You may also like
Latest Posts from