తెలుగులో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలన్ని హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా రీరిలీజ్ లు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక శేఖర్ కమ్ముల కల్ట్ క్లాసిక్ సినిమా రీ రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. సుమంత్ (Sumanth) నటించిన హిట్ సినిమాల్లో ‘గోదావరి’ (Godavari) కూడా ఒకటి. కమలిని ముఖర్జీ (Kamalinee Mukherjee) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకుడు.
ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది.. అనేది ఈ సినిమా క్యాప్షన్.
పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) ‘తొలిప్రేమ’ (Tholi Prema) వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన జి.వి.జి రాజు (G. V. G. Raju) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2006 మే 19న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
భద్రాచలం బ్యాక్ డ్రాప్లో ఉండే లొకేషన్స్, గోదావరి అందాలు నడుమ సాగే ఈ సినిమా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. కె.ఎం.రాధాకృష్ణన్ (K. M. Radha Krishnan) సంగీతంలో రూపొందిన పాటలు మంచి హిట్ అయ్యాయి.
‘గోదావరి’ సినిమాని మార్చి 1న ఈ చిత్రాన్ని మళ్ళీ థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. రీ రిలీజ్లో ‘గోదావరి’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.