గత సంవత్సరం, సంక్రాంతికి విడుదలైన వెంకటేష్ సైంధవ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎపిక్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ సంవత్సరం, . ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ తో తిరిగి ట్రాక్ లోకి వచ్చేసాడు. పండుగ రోజునే విడుదల చేయటం కలిసొచ్చింది. సినిమా, పాటలు ప్రమోషన్‌లతో పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేసి, భాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలను ప్రక్కకు పెట్టి పెద్ద హిట్ కొట్టారు. అయితే ఇప్పుడే వెంకటేష్ కు అసలైన సమస్య ఎదురైంది. ఏ సినిమా చేయాలి నెక్ట్స్ అని.

నిన్న మొన్నటి వ‌ర‌కూ వెంక‌టేష్ సినిమా రూ.50 కోట్లు దాట లేదు. అలాంటిది ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ ఏకంగా రూ.300 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. దాంతో వెంకీ ఏ కథ నెక్ట్స్ చేయాలి, ఏ దర్శకుడుతో ముందుకు వెళ్లాలి అనే అయోమయంలో ప‌డిపోయారు.

‘సంక్రాంతికి వ‌స్తున్నాం’రిలీజ్ కు ముందు వెంక‌టేష్ ఓకే చేసిన కథలను ప్రక్కన పెట్టేస్తున్నారని సమాచారం. ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’ క‌థార‌చ‌యిత చెప్పిన లైన్ తో సినిమా చేద్దామనుకున్నాడు. ఆల్మోస్ట్ ప‌ట్టాలెక్కిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వెంకీ డ్రాప్ అయ్యార‌ని తెలుస్తోంది.

అలాగే వెంకీ అట్లూరి కూడా వెంక‌టేష్ కి ఓ క‌థ చెప్పారు. దాన్నీ ఆయ‌న ప‌క్క‌న పెట్టారంటున్నారు. వీటితో పాటు సురేంద‌ర్ రెడ్డి ఇప్పుడు వెంక‌టేష్ కోసం యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ క‌థ రెడీ చేస్తూంటే దాన్ని వద్దంటున్నారని వార్త. ఇక కొత్త ద‌ర్శ‌కుల‌ు అసలు వద్దంటున్నారట. ఇప్పుడు సురేష్ బాబు వెంకటేష్ నెక్ట్స్ ప్రాజెక్టు కోసం శ్రద్దగా కథలు వింటున్నారట. అదీ సంగతి.

,
You may also like
Latest Posts from