హీరో రజనీకాంత్‌ (Rajinikanth)కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అయితే ఆ మధ్యన వరస ప్లాఫ్ లు పడటంతో కాస్త తగ్గినా జైలర్ సూపర్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. దాంతో ఆయన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కూలీ’ (Coolie)తెలగు రైట్స్ కు ఓ రేంజిలో క్రేజ్ ఏర్పడింది. తెలుగులో పెద్ద నిర్మాతలు పోటీలో ఉన్నట్లు ట్రేడ్ చెప్తోంది.

ఇప్పటికే ఏషియన్ సునీల్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ ఈ పోటీలో ప్రముఖంగా ఉన్నారట. లోకేష్ గత చిత్రం లియో తో బాగా లాభపడ్డ నాగ వంశీ ఎట్టి పరిస్దితుల్లోనూ ఈ డీల్ వదులుకునేలా లేరని చెప్తున్నారు. ఇప్పటికి నలభై కోట్ల దాకా ఈ సినిమా రైట్స్ కు పెట్టడానికి సిద్దపడ్డారట. ఇంకెవరైనా పోటీకు వస్తే సీన్ మారిపోతుందని చెప్తున్నారు.

ఈ చిత్రాన్ని భారీ ఖర్చుతో కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్‌ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశంతో ఇది ముస్తాబవుతోంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ చేసుకుంటోంది. రీసెంట్ గా చెన్నై విమానాశ్రయంలో రజనీపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. త్వరలోనే వైజాగ్, హైదరాబాద్‌లలో ఆఖరి షెడ్యూల్‌ జరగనుంది.

మార్చి నాటికి షూటింగ్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ చిత్ర తొలి గ్లింప్స్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

, , ,
You may also like
Latest Posts from