ఒక్కసారిగా అందరూ పోక్సో యాక్ట్ గురించి మాట్లాడేలా చేసారు హీరో నాని. మైనర్లను లోబరుచుకుని వాళ్ళను లైంగిక వేధింపులకు గురి చేసే వాళ్లకు కఠిన శిక్ష విధించే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టం పోక్సో ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పాయింట్ నే తీసుకుని సినిమా చేసారు నాని. ఓ అమాయికుడుపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదైనా చాలు నిజం తేలకముందే నిందితుడి జీవితం నరకప్రాయమవుతుంది. ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశంతో దర్శకుడు రామ్ జగదీశ్ చేసిన ప్రయత్నమే కోర్ట్ (స్టేట్ వర్సెస్ ఏ నో బడీ). నాని నిర్మించిన ఈ కోర్ట్ డ్రామా మార్చ్ 14 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.
ఈ ట్రైలర్ లో మొత్తం కథ చెప్పేసారు. డబ్బు,పలుకుబడి కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడో యువకుడు (హర్ష్ రోషన్). వీణ్ణి ఆపటం కోసం పిల్ల తండ్రి (శివాజీ) పోక్సో కింద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిస్తాడు. తండ్రికు భయపడిన ఆ యువతి (శ్రీదేవి) మౌనంగా ఉండిపోతుంది.
పేదవాడైన ఆ కుర్రాడి కుటుంబం న్యాయం కోసం లాయర్లను కలిస్తే వీళ్ళ తరఫున వాదించేందుకు ఎవరూ ముందుకు రారు. కానీ ఓ యంగ్ లాయిర్ (ప్రియదర్శి) ఎంతమంది వారిస్తున్నా ధైర్యంగా టేకప్ చేస్తాడు. లొసుగులను దాటుకుని చిక్కులను ఎదురుకుంటూ చివరికి ఎలా న్యాయం చేశాడనేది తెరమీద చూడాలి